Site icon NTV Telugu

Ginna: రేణుకగా అలరించబోతున్న పోర్న్ స్టార్!

Ginna

Ginna

 

బాలీవుడ్‌ మోస్ట్ హ్యాపెనింగ్ స్టార్ హీరోయిన్ సన్నీ లియోన్ తెలుగులో పూర్తి స్థాయిలో న‌టిస్తున్న తాజా చిత్రం ‘జిన్నా’. ఈ చిత్ర యూనిట్ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను బుధవారం విడుదల చేసింది. ఈ చిత్రంలో సన్నీ లియోన్ పాత్ర ఏమిటి, ఆమె ఎలా నటిస్తుందో తెలుసుకోవాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంద‌ర్భంలో కొత్త లుక్ సోషల్ మీడియాలో విప‌రీత‌మైన‌ బజ్ క్రియేట్ చేస్తోంది. ఇందులో సన్నీ లియోన్ ‘రేణుక’ అనే పాత్రను పోషిస్తోంది. జిన్నా చిన్నప్పటి స్నేహితురాలైన తాను అతని జీవితంలో అప్ అండ్ డౌన్స్ కు ఎలా కారణమైందో తెర మీద చూడాలని సన్నీ చెబుతోంది. ఊహకందని మలుపులతో కథ సాగుతుందని తెలిపింది. ఈషాన్ సూర్య దర్శకత్వం వహించిన ‘జిన్నా’ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లేను రచయిత కోన వెంకట్ అందించారు. హీరో మంచు విష్ణు స‌ర‌స‌న‌ సన్నీలియోన్ తో పాటు మరో డైన‌మిక్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటోంది.

తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అవా ఎంటర్‌టైన్‌మెంట్‌, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ‘జిన్నా’ రోజురోజుకు మంచి బజ్‌ని సొంతం చేసుకుంటోంది. ఈ మూవీలోని పాటకు ‘నాటు నాటు’ ఫేమ్ ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ అందించారు. అనూప్ రూబెన్స్ స్వరాలు అందించిన ఈ మూవీకి చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్. తన ఫస్ట్ లుక్ పోస్టర్ ను సన్నీలియోన్ సైతం తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది.

Exit mobile version