Site icon NTV Telugu

Sundeep Kishan: ధమాకా డైరెక్టర్ తో సందీప్ కిషన్ కొత్త సినిమా

Sundeep Kishan, Thrinadha Rao Nakkina

Sundeep Kishan, Thrinadha Rao Nakkina

Sundeep Kishan, Thrinadha Rao Nakkina #SK30 Announced: ‘ఊరు పేరు భైరవకోన’ బ్లాక్‌బస్టర్ విజయంతో మంచి జోష్ మీద ఉన్న హీరో సందీప్ కిషన్‌కి కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లు లైన్ లో పెడుతున్నారు. ఇక అందులో భాగంగానే ఈ రోజు సందీప్ కిషన్‌ ల్యాండ్‌మార్క్ 30వ సినిమాని అనౌన్స్ చేశారు. ‘ధమాకా’ వంటి భారీ విజయాన్ని అందించిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన ఈ #SK30కు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ సంయుక్తంగా నిర్మించనున్నట్టు ప్రకటనలో పేర్కొన్నారు. సామజ వరగమన, ఊరు పేరు భైరవకోన వంటి వరుస హిట్‌ల తర్వాత, వారి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ హిట్‌ కొట్టేందుకు ఈ రెండు ప్రొడక్షన్ హౌస్‌లు ఈ సినిమా కోసం మళ్లీ జతకట్టాయి. త్రినాధ రావు నక్కిన, ప్రసన్న కుమార్ బెజవాడ కాంబినేషన్ గతం నుంచి చాలా సక్సెస్ ఫుల్ అని చెప్పొచ్చు.

Ananya Nagalla: వేణుస్వామిని కలిసిన అనన్య.. పూజలా.. క్షుద్ర పూజలా?

వారు ఇద్దరూ కలిసి ధమాకాతో సహా అనేక బ్లాక్‌బస్టర్‌లను అందించారు. ఇక పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ కొత్త సినిమాకి ప్రసన్న కుమార్ బెజవాడ కథ, స్క్రీన్‌ప్లే డైలాగ్‌లను అందిస్తున్నారు. రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. విభిన్నమైన స్క్రిప్ట్‌లతో అలరించే సందీప్ కిషన్ #SK30 లో డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించనున్నారని అంటున్నారు. గ్రాండ్ ప్రొడక్షన్, సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో రూపొందించబడుతుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమాలో త్రినాథరావు నక్కిన, ప్రసన్న కుమార్ ల మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుందని, ఈ సినిమాకి సంబంధించిన ఇతర నటీనటులు, టెక్నికల్ టీం వివరాలు త్వరలో మేకర్స్ తెలియజేస్తారని అంటున్నారు.

Exit mobile version