Site icon NTV Telugu

పూజా కార్యక్రమాలతో సందీప్ కిషన్ నెక్స్ట్ మూవీ లాంచ్

Sundeep Kishan next movie launched with a formal Pooja ceremony

యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన కామెడీ ఎంటర్టైనర్ “గల్లీ రౌడీ” సినిమాతో సెప్టెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో సందీప్ కిషన్ ఫుల్ జోష్ లో ఉన్నారు. అదే ఉత్సాహంతో వెంటనే నెక్స్ట్ ప్రాజెక్ట్ ను ప్రారంభించారు. విఐ ఆనంద్‌ దర్శకత్వంలో సందీప్ కిషన్ నెక్స్ట్ మూవీ తెరకెక్కబోతోంది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమా షూటింగ్ ఈ చిత్రం ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ వేడుకకు అల్లరి నరేష్, నాగశౌర్య అతిథులుగా విచ్చేశారు.

Read Also : “పొన్నియన్ సెల్వన్” షూటింగ్ పూర్తి

సీనియర్ నిర్మాత జెమిని కిరణ్, నిర్మాత సుధీర్ స్క్రిప్ట్‌ను మేకర్స్‌కు అందజేయగా, హీరో అల్లరి నరేష్ ముహూర్తం షాట్ కోసం మొదటి క్లాప్ కొట్టారు. నాగ శౌర్య కెమెరా స్విచాన్ చేశారు. నంది దర్శకుడు విజయ్ కనకమేడల ముహూర్తం షాట్‌కి దర్శకత్వం వహించారు. అగ్ర నిర్మాత అనిల్ సుంకర ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. అక్టోబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. కావ్య థాపర్, ఖుషీ రవి ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. హస్య మూవీస్ బ్యానర్‌పై రజేష్ దండా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీత స్వరకర్త.

Exit mobile version