NTV Telugu Site icon

Sundeep Kishan: రవితేజ గారంటే చాలా గౌరవం ఉంది.. కానీ పోటీకి దిగక తప్పడం లేదు

Sundeep Kishan

Sundeep Kishan

Sundeep Kishan Clarity on Clash with Raviteja’s Eagle: హీరో సందీప్ కిషన్, టాలెంటెడ్ డైరెక్టర్ విఐ ఆనంద్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ ‘ఊరు పేరు భైరవకోన’. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్న ఈ సినిమాని ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్నారు. ఊరు పేరు భైరవకోన రిలీజ్ డేట్ ఎప్పుడో అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్లు చాలా కాలం క్రితమే అనౌన్స్ చేశారు. అయితే సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న ఈగల్ సినిమాకి ఫిబ్రవరి 9 సోలో రిలీజ్ డేట్ ఇస్తున్నట్టు అధికారిక ప్రకటన చేసింది ఫిలిం ఛాంబర్. అయినా సరే ‘ఊరు పేరు భైరవకోన’ రిలీజ్ అవుతూ ఉండగా ఈరోజు ట్రైలర్ కూడా లాంచ్ చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఈ రిలీజ్ డేట్ అంశం గురించి ప్రశ్నించగా సందీప్ కిషన్ క్లారిటీ ఇచ్చారు. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ మేము ముందు సంక్రాంతికి రావాలని అనుకున్నాం.

Chiranjeevi : మెగాస్టార్ కు పద్మవిభూషణ్ ఇవ్వనున్న కేంద్రం..?

దెయ్యాలు, భూతాలు, మ్యాజిక్ ఉన్నాయి కాబట్టి పిల్లలకి కూడా నచ్చుతుంది అని అప్పుడే కరెక్ట్ అని మేము అనుకున్నాం, అనిల్ కూడా అనుకున్నారు. అయితే సంక్రాంతికి అంతమంది పోటీలో ఉండడంతో వద్దనుకుని ఫిబ్రవరి 9 డేట్ రోజు రిలీజ్ అనౌన్స్ చేసిన టిల్లు స్క్వేర్ టీంతో మాట్లాడి మేము అనౌన్స్ చేశాము. ఇప్పుడు మేమున్న పరిస్థితిలో రిలీజ్ డేట్ మార్చుకోలేం అని అన్నారు. ఇక రవితేజ గారికి నేను పెద్ద ఫ్యాన్, మా డైరెక్టర్ లాస్ట్ సినిమా రవితేజ గారితోనే చేశారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో మాకు మంచి అనుబంధం ఉంది కానీ వెనక్కి వెళ్లలేమని అన్నారు. ఈ సినిమాకి శేఖర్ చంద్ర సంగీతం అందించగా మొదటి రెండు పాటలు- నిజమే నే చెబుతున్నా, హమ్మా హమ్మా ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి. వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకి రాజ్‌ తోట సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్, ఎ రామాంజనేయులు ఆర్ట్ డైరెక్టర్. భాను భోగవరపు, నందు సవిరిగాన ఈ చిత్రానికి సంభాషణలు అందిస్తున్నారు.