Sumaya Reddy : చేతినిండా కట్టల కొద్దీ డబ్బు, కిలోల కొద్దీ బంగారం..సరికొత్త ‘హారర్’ మిస్టరీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోయిన్లు అంటే కేవలం గ్లామర్ కే పరిమితం అనుకునేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. యాక్టింగ్ తో పాటు నిర్మాణ బాధ్యతలు, రచనా వ్యాసంగం కూడా చేపడుతూ వన్ ఉమెన్ ఆర్మీలా సత్తా చాటుతున్నారు. సరిగ్గా ఇలాగే ‘డియర్ ఉమ’ సినిమాతో అటు నటిగా, ఇటు నిర్మాతగా, మరోవైపు రచయితగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు టాలెంటెడ్ బ్యూటీ సుమయా రెడ్డి. తొలి అడుగుతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు తన సెకండ్ ప్రాజెక్ట్ తో బాక్సాఫీస్ దగ్గర ఏదో గట్టి మ్యాజిక్కే చేయడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా సుమ చిత్ర ఆర్ట్స్ బ్యానర్‌పై, సుమయా రెడ్డి స్వీయ నిర్మాణంలో ప్రొడక్షన్ నెం.2గా ఓ కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. దీపావళి పండుగను పురస్కరించుకుని ఈ మూవీకి సంబంధించి వదిలిన ఓ ప్రీ-లుక్ పోస్టర్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఈ పోస్టర్ చూసిన ఎవరికైనా ఒక్క క్షణం మైండ్ బ్లాక్ అవ్వడం గ్యారెంటీ. ఎందుకంటే.. అందులో సుమయా రెడ్డి చేతి నిండా కట్టల కొద్దీ నోట్లు, కిలోల కొద్దీ బంగారంతో అచ్చం ఓ మహారాణిలా దర్శనమిస్తున్నారు. పోస్టర్ లో ఆమె రాజసం చూస్తుంటే ఏదో భారీ బడ్జెట్ పీరియాడికల్ డ్రామానో అనుకుంటే పొరపాటే. అసలు సెన్సేషనల్ ట్విస్ట్ ఇక్కడే దాగుంది!
ఈ సినిమా ఓ డిఫరెంట్ ‘హారర్-కామెడీ’ నేపథ్యంలో తెరకెక్కుతోందట. సాధారణంగా హారర్ కామెడీ అనగానే పాత కాలపు భవనాలు, భయపెట్టే దెయ్యాలు, మధ్యలో నవ్వించే సీన్లు గుర్తొస్తాయి. కానీ ఇక్కడ కట్టల కొద్దీ డబ్బు, లంకె బిందెల్లాంటి బంగారంతో హారర్ థీమ్ ను ముడిపెట్టడం అందరిలోనూ విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. అసలు ఆ దెయ్యానికి, ఆ బంగారానికి లింక్ ఏంటి? ఇప్పటివరకు టాలీవుడ్ తెరపై ఎవరూ టచ్ చేయని ఓ సరికొత్త పాయింట్ తో ఈ కథను సిద్ధం చేసినట్లు పోస్టర్ తోనే హింట్ ఇచ్చేశారు. ఆస్తుల కోసం జరిగే కుట్రల చుట్టూ తిరిగే దెయ్యం కథా? లేక నిధిని కాపాడే మహారాణి ఆత్మ కథా? అనే చర్చ అప్పుడే మొదలైంది. కేవలం ఒకే ఒక్క పోస్టర్ తో సినిమాపై ఎక్కడలేని అంచనాలను క్రియేట్ చేయడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన క్రేజీ టైటిల్ అనౌన్స్మెంట్ తో పాటు ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ఏది ఏమైనా.. ఈ దీపావళి పోస్టర్ తో సుమయా రెడ్డి వేసిన సెకండ్ స్టెప్ మామూలుగా లేదని, భయం-నవ్వు కలగలిపిన ఓ సరికొత్త సెన్సేషన్ కే ప్లాన్ చేసిందని సినీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. త్వరలో రాబోయే టైటిల్ అనౌన్స్మెంట్ తో ఈ మిస్టరీ వీడే అవకాశం ఉంది.
Also Read
- Athulya Chandra: హీరోయిన్ అతుల్య చంద్ర కేసులో షాకింగ్ ట్విస్ట్.. అడ్డంగా బుక్కైన కీచక డాక్టర్ విదేశాలకు పరార్!
- Ranabali OTT Release Date: ఇక మీ ఇంట్లోకి రాబోతున్న 'రణబాలి'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- NTR Dragon: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి సాలిడ్ అప్డేట్.. పూనకాలు తెప్పించేలా ‘డ్రాగన్’ క్లైమాక్స్ ఫైట్!
- Dulquer Salmaan: ‘సీన్’ డైరెక్టర్‌తో దుల్కర్ సినిమా? హీరోయిన్గా క్రేజీ బ్యూటీ!
తాజావార్తలు
-
Workplace Trends: 9 టు 5 ఉద్యోగాలకు కాలం చెల్లిందా? నేటి యువత కోరుకుంటోంది ఇదేనా!
-
CM Revanth Reddy : కేటీఆర్‌పై రేవంత్ ఫైర్.. పది జన్మలెత్తినా కాలేవంటూ..
-
Pakistan Tarbela Dam Accident: పాక్‌లో నిర్మాణంలో ఉన్న ఆనకట్ట కూలి భారీ వరదలు.. చైనా నిర్మాణ సంస్థపై ప్రశ్నలు..!
-
Diwali Cleaning Tips: దీపావళి వేళ నూనె మరకలు జిడ్డుగా మారిపోయాయా? ఈ సింపుల్ చిట్కా చాలు..
-
SBI: ప్రవాసులకు గుడ్ న్యూస్.. అమెరికాలో ఎస్బీఐ గ్రాండ్ ఎంట్రీ!
ట్రెండింగ్
-
7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!