NTV Telugu Site icon

Sumaya Reddy: హీరోయిన్‌గా మరో తెలుగమ్మాయి

Sumaya Reddy

Sumaya Reddy

Sumaya Reddy Debuting with Dear Uma Movie: తెలుగు అమ్మాయిలు సినీ పరశ్రమలోకి ఎక్కువ గా వచ్చేందుకు ఇష్టపడరు అని అపోహ ఉంది కానీ ఇప్పుడు తెలుగు అమ్మాయిలు టాలీవుడ్ లో దూసుకు పోతున్నారు. ఇప్పటికే ఎంతో మంది తమ టాలెంట్ నిరూపించుకోగా ఇపుడు అనంతపురంకు చెందిన తెలుగు అమ్మాయి సుమయా రెడ్డి మోడల్‌గా కెరీర్ ప్రారంభించి…. సినిమా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయింది. నిజానికి ఆమె మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తూ భిన్నంగా ఆలోచించి సొంతంగా ప్రొడక్షన్ హౌస్ కూడా ప్రారంభించారు. సుమయా తన తొలి మూవీ డియర్ ఉమ కోసం విభిన్నమైన క్రాఫ్ట్‌లను హ్యాండిల్ చేస్తూ తన మల్టీ టాలెంట్ ను ప్రేక్షకులను పరిచయం చేసేందుకు సిద్ధం అవుతున్నారు.

Bigg Boss Telugu OTT 2: బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 అప్పటి నుంచే..నాగార్జున ప్లేస్ లో ఆ హీరో?

పృథ్వీ అంబర్‌ హీరోగా నటించిన ఈ డియర్ ఉమ సినిమాలో సుమయా రెడ్డి హీరోయిన్ గా నటించిడమే కాకండా రచయితగా, నిర్మాతగా కూడా వ్యవరిస్తున్నారు. సుమచిత్ర ఆర్ట్స్ బ్యానర్‌పై సాయి రాజేష్ మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇక డియర్ ఉమ టీం త్వరలో ప్రమోషన్స్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ మూవీతో సుమయ తన నటనా ప్రావీణ్యాన్ని ప్రదర్శించి అందరినీ ఆకట్టుకోకునే ప్రయత్నం చేస్తోంది. ఇక ఈ సినిమా హిట్ అయితే ఆ తరువాత ఆమెకు క్రేజీ ఆఫర్లు వచ్చేలా ఉన్నాయి. సుమయ తన అందంతో, నటనతో మున్ముందు టాలీవుడ్ ను కట్టి పడేసేలా ఉందని ఆమె సోషల్ మీడియా ఫాలోవర్స్ కామెంట్ చేస్తున్నారు. చూడాలి ఆమె మొదటి సినిమాతో ఎలా ఆకట్టుకోనుంది అనేది.

Show comments