NTV Telugu Site icon

Vimanam: వేశ్యగా మారిన అనసూయ.. ?

Anasuya

Anasuya

Vimanam: టైటిల్ చూడగానే.. ఏంటి ఈ టైటిల్.. అని తిట్టుకోకండి. విమానం అనే సినిమాలో అనసూయ వేశ్య పాత్రలో కనిపిస్తుంది. ఇది ఆమెకు మొదటిసారి కాదు. ఇలాంటి పాత్రలో అంతకుముందు కూడా కనిపించింది. కథ నచ్చితే ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోతుంది అనసూయ. డైరెక్టర్ సముతిరఖని ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం విమానం. శివ ప్రసాద్ యానాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కమెడియన్ రాహుల్ రామకృష్ణ, అనసూయ, మాస్టర్ ధృవన్, మీరా జాస్మిన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను సి స్టూడియోస్ బ్యానర్ పై కిరణ్ కొర్రపాటి నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అంగవైకల్యం ఉన్న తండ్రి.. తన కొడుకుకు విమానం తో ఉన్న సంబంధం ఏంటి అనేది హృద్యంగా చూపించనున్నారు. ఇక ఇందులో సుమతి అనే వేశ్య పాత్రలో అనసూయ నటిస్తుంది. ఈ చిత్రంలో అనసూయ క్యారెక్టర్ పై ఒక సాంగ్ ను కూడా షూట్ చేశారు. ఆ సాంగ్ నే నేడు మేకర్స్ రిలీజ్ చేశారు.

BRO: నిన్న మామ.. నేడు అల్లుడు.. ఈ స్పీడ్ మాములుగా లేదు ‘బ్రో’

“సుమతీ.. సుమతీ.. నీ నడుములోని మడత చూస్తే .. నా ప్రాణమగాదే వనితా” అంటూ సాగే ఈ సాంగ్ వినసొంపుగా ఉంది. ముఖ్యంగా సాంగ్ మొత్తం అనసూయ అందాలతో నింపేశారు. వేశ్య క్యారెక్టర్ కు తగ్గట్టుగానే ఆమె తన అందచందాలను ఆరబోస్తూ కనిపించింది. ఆమెపై మనసు పారేసుకున్న రాహుల్.. ఆమెను దొంగచాటుగా కిటికీలో నుంచి ఫోటోలు తీస్తూ ఆమె అందాన్ని వర్ణిస్తున్నట్లు లిరిక్స్ ను బట్టి అర్ధమవుతోంది. అంతేకాకుండా.. రూపాయి కూడా లేని పేదవాడిని.. వెయ్యి రూపాయలు నీకు ఇవ్వాలంటే.. ఎలా అంటూ తన బాధను వెళ్లగక్కుతున్నట్లు కనిపిస్తుంది. ఇక ఈ సాంగ్ ను రాసింది, పాడింది.. మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ కావడం విశేషం. ఆయనరాసిన ప్రతి లిరిక్.. అనసూయ అందాన్ని కొలిచేవిధంగానే కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ సినిమా జూన్ 9 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా అనసూయకు ఎలాంటి విజయాన్ని అందించనుందో చూడాలి.

Show comments