NTV Telugu Site icon

Sumanth: పవన్ పై అభిమానం.. వారాహి పేరుతో సుమంత్ కొత్త సినిమా

Varahi

Varahi

Sumanth: అక్కినేని హీరో సుమంత్.. ఒక పక్క హీరోగా.. ఇంకోపక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ మంచి విజయాలనే అందుకుంటున్నాడు. ఈ ఏడాది రిలీజ్ అయిన సార్ మూవీలో ఒక కీలక పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇప్పటికే అనగనగా ఒక రౌడీ అనే సినిమాను అనౌన్స్ చేసాడు. శ్రీనివాస్ రెడ్డి తో జంబలకిడి పంబ అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మను యజ్ఞ.. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అప్పుడెప్పుడో ఈ సినిమాను మొదలుపెట్టినట్లు చెప్పుకొచ్చారు. ఇక సుమంత్ బర్త్ డే రోజున టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఆ సినిమా ఇప్పటివరకు పూర్తి అయ్యిందో లేదో తెలియదు. ఈ నేపథ్యంలోనే సుమంత్.. మరో సినిమాకు శ్రీకారం చుట్టాడు.

Deepika Padukone: దీపికా కూడా నెపోటిజం బాధితురాలేనా!.. హాట్‌టాపిక్‌గా హీరోయిన్‌ కామెంట్స్‌

సుమంత్, మీనాక్షీ గోస్వామి జంటగా.. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్న చిత్రం మహేంద్రగిరి వారాహి. ఈ సినిమాను మధు కాలిపు, ఎం. సుబ్బారెడ్డి నిర్మిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా టైటిల్ ను స్వరూపానందేంద్ర సరస్వతి మహర్షి రిలీజ్ చేశారు. ఆయన ఆశ్రమానికి వెళ్లిన చిత్రబృందం.. ఆయన ఆశీస్సులు అందుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక డైరెక్టర్ సంతోష్ పవన్ కళ్యాణ్ అభిమాని అని తెలుస్తోంది. ఆయన మీద అభిమానంతోనే ఆయన వాహనానికి పెట్టిన వారాహి పేరును ఈ సినిమాకు పెట్టినట్లు సమాచారం. మరి ఇందులో ఎంత నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే ఈ సినిమా సుమంత్ కు ఎలాంటి హిట్ నుఇస్తుందో చూడాలి.