సుమంత్ సంక్రాంతి రాజు ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ ‘7 డేస్ 6 నైట్స్’. ఇందులో ఆయన కుమారుడు సుమంత్ అశ్విన్ ఓ హీరో. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో సుమంత్ అశ్విన్, రజనీకాంత్ నిర్మించారు. 24న సినిమా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా సుమంత్ అశ్విన్ మీడియాతో భేటీ అయ్యారు.
సుమంత్ అశ్విన్ హీరోగా పరిచయమైన ‘తూనీగ తూనీగ’ జూలై 20కి పదేళ్లు పూర్తి చేసుకుంటోంది. తన కెరీర్‌లో సక్సెస్ ఫుల్ సినిమాలు ప్లాప్ ఉన్నా జర్నీ మాత్రం చాలా అందంగా ఉందని, పదేళ్లు టైమ్ తెలియకుండా స్పీడుగా వెళ్ళిందంటున్నాడు సుమంత్. ఇక చేసిన పాత్రలు కాకుండా వెరైటీ రోల్స్ చేయాలని ఉందని,
ఇప్పటివరకు తను చేసిన సినిమాలతో పోల్చి చూస్తే ‘7 డేస్ 6 నైట్స్’లో డిఫరెంట్ రోల్ చేశానని చెబుతున్నాడు. ‘అంతకు ముందు ఆ తర్వాత’లో సహజత్వానికి దగ్గరగా ఉండి కొన్ని అంశాల్లో లార్జర్ దేన్ లైఫ్ ఎలిమెంట్ ఉంటుందని, ‘7 డేస్ 6 నైట్స్’లో రియాలిటీకి దగ్గరగా ఉన్న రోల్ అని అంటూ ప్రేక్షకులు కూడా కొత్తదనాన్ని ప్రోత్సహిస్తున్నారని, కరోనా తర్వాత వారు వరల్డ్ సినిమా చూస్తూ అప్‌డేట్ అవటమే ఆందుకు కారణమంటున్నాడు సుమంత్. సినిమాగా చూస్తే సింపుల్ ఫిల్మ్ కానీ ప్రేక్షకులు హ్యాపీగా ఎంటర్‌టైన్ అయ్యే సినిమా అని చెబుతున్నాడు. ఇక ఫాదర్స్ డే సందర్భంగా నాన్న ఎం.ఎస్. రాజుకు గిప్ట్ ప్లాన్ చేస్తున్నానని, అయితే ఆయనే నాకు ‘7 డేస్ 6 నైట్స్’ కాపీ చూపించి గిప్ట్ ఇచ్చారంటున్నాడు. ‘నాన్నగా ఏది కావాలంటే అది ఇచ్చారు. ఆయనో పర్ఫెక్ట్ ఫాదర్. ఎన్ని జన్మలెత్తినా ఆయన కొడుకుగానే జన్మించాలని కోరుకుంటున్నా. ఒక్క మాటలో చెప్పాలంటే ఫాదర్స్ లో ఆయన ఒక్కడంటే ‘ఒక్కడు” అంటూ ఎమోషనల్ గా ఫీలయ్యాడు సుమంత్ అశ్విన్. ఎంతో మంది హీరోలకు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చి కొడుకుగా తనకు ఇవ్వలేకపోవడంపై స్పందిస్తూ ‘ఒక్కోసారి టైమ్ అంతే! ‘తూనీగ తూనీగ’ కోసం మూడు నాలుగు సినిమాలకు పెట్టినంత ఎఫర్ట్ పెట్టారు. ప్రశంసలు లభించినా వసూళ్లు దక్కలేదు. కొన్ని సినిమాలు పేపర్ మీద బావుంటాయి. కానీ అనుకున్న ఫలితాలు ఇవ్వకపోవచ్చు’ అని జవాబిచ్చాడు.
Sumanth Ashwin : మా నాన్న ‘ఒక్కడు’

New Project (29)