Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Sumanth Ashwin About Prabhas Pournami Film

Sumanth Ashwin: నా వల్ల కాదు.. ప్రభాస్ సినిమా వల్లే నష్టాలు

Published Date :June 26, 2022 , 4:36 pm
By NTV WebDesk
Sumanth Ashwin: నా వల్ల కాదు.. ప్రభాస్ సినిమా వల్లే నష్టాలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఎమ్మెస్ రాజు.. ఒకప్పుడు బ్లాక్ బస్టర్ సినిమాల నిర్మాత. ‘ఒక్కడు’, ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ లాంటి సూపర్ హిట్ సినిమాల్ని ఆయన నిర్మించారు. అలాంటి ఆయన ఆ తర్వాతి కాలంలో నష్టాల్లో కూరుకుపోయారు. పెద్ద హీరోలతో తిరిగి సినిమాల్ని నిర్మించలేని దుస్థితికి చేరుకున్నారు. చివరగా.. ఈయన నిర్మించింది ‘మస్కా’. ఇప్పుడు దర్శకుడిగా సినిమాలు చేస్తూ వస్తున్నారు కానీ, నిర్మాతగా తన ప్రస్థానాన్ని ఆపేశారు. అసలెందుకు ఎమ్మెస్ రాజుకి ఈ పరిస్థితి వచ్చింది? నిర్మాతగా ఎందుకు తన జర్నీని ముగించారు? అనే చర్చలు తెరమీదకి వచ్చినప్పుడు.. తనయుడు సుమంత్ అశ్విన్ తో చేసిన సినిమాలు తేడా కొట్టడం వల్లేనని కామెంట్స్ వచ్చాయి.

అయితే, అందులో ఏమాత్రం వాస్తవం లేదని తాజాగా సుమంత్ చెప్పుకొచ్చాడు. తన తండ్రి ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో చేసిన ‘‘7 డేస్ 6 నైట్స్’’ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా లేటెస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన వల్లే తండ్రి నష్టపోయారన్న వ్యాఖ్యల్ని తోసిపుచ్చాడు. ప్రభాస్ తో చేసిన ‘పౌర్ణమి’ సినిమా తేడా కొట్టడం వల్లే భారీ నష్టాలు చవిచూడాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చాడు. ‘‘వర్షం తర్వాత అదే కాంబినేషన్ లో సినిమా అనగానే భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో, మా నాన్న ఉన్నదంతా తీసుకొచ్చి ‘పౌర్ణమి’కి పెట్టేశారు. సెట్స్ కోసం భారీ స్థాయిలో ఖర్చు వెచ్చించారు. ఆ సినిమాకి ప్రశంసలైతే వచ్చాయి కానీ, బాక్సాఫీస్ వద్ద ఆడలేదు. ఆ దెబ్బకు భారీ నష్టాలు వచ్చాయి. ఆ నష్టాలు నాన్న కెరీర్ పై బాగా ఎఫెక్ట్ చూపించాయి. ఆ సినిమా పెద్ద దెబ్బే కొట్టింది’’ అని సుమంత్ వెల్లడించాడు.

ఆ తర్వాత కొత్త హీరోని పెట్టి చేసిన ‘వాన’ వల్ల కూడా నష్టాలొచ్చాయని సుమంత్ తెలిపాడు. సొంత బ్యానర్ లో తాను ఇంతవరకూ ఒక్క సినిమా కూడా చేయలేదని, అసలు తాను హీరోగా ఎంట్రీ ఇచ్చే సమయానికే తన తండ్రి నష్టాల్లో కూరుకుపోయారని అన్నాడు. కాబట్టి, తన వల్లే నాన్న నష్టపోయాడయని వచ్చిన కామెంట్స్ లో వాస్తవం లేదని సుమంత్ అశ్విన్ చెప్పుకొచ్చాడు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 7 Days 6 Nights
  • MS Raju
  • Pournami Movie
  • prabhas
  • Sumanth Ashwin

తాజావార్తలు

  • Jewellery Missing: ఛీ.. ఛీ.. మృతదేహాల నుంచి ఆభరణాలు కొట్టేయడం ఏంటయ్యా..?

  • Mojtaba: ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా కొత్త సందేశం.. ఆసక్తి రేపుతోన్న మెసేజ్

  • Vizag Murder: విశాఖలో దారుణం.. ప్రియురాలిని ముక్కలుగా నరికి, ఫ్రిజ్‌లో పెట్టిన నేవీ ఉద్యోగి!

  • PSL 2026 Ball Tampering: పాకిస్థాన్ లీగ్‌లో బాల్ ట్యాంపరింగ్.. బజారున పీఎస్‌ఎల్ పరువు!

  • CM Chandrababu: నాయుడుపేటలో సీఎం చంద్రబాబు పర్యటన.. పుదూరులో టిడ్కో గృహాల ప్రారంభం!

ట్రెండింగ్‌

  • Instagram Offline Reels: రీల్స్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఇక ఇంటర్నెట్ లేకపోయినా ‘రీల్స్’ చూసేయొచ్చు .. ఎలాగంటే.!

  • Remedies for Cracked Heels : మీ పాదాల పగుళ్లకు ఇక చెక్.. ఇంట్లోనే అద్భుతమైన చిట్కాలు.!

  • Lemon Pickle : వేసవి స్పెషల్.. నిమ్మకాయ పచ్చడి ఇలా చేస్తే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది.!

  • Kitchen Tips : వేసవిలో పాలు త్వరగా పాడవుతున్నాయా..? అయితే ఈ సింపుల్ ట్రిక్ మిస్ కాకండి.!

  • కొత్త ఫీచర్లు, మెరుగైన 25కి పైగా అప్డేట్స్‌తో Hyundai Exter Facelift లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions