NTV Telugu Site icon

Roshan Kanakala: సలార్ సెగ.. సుమ కొడుకు పరిస్థితి ఏంటి.. ?

Roshan

Roshan

Roshan Kanakala: సాధారణంగా పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుంటే.. చిన్న సినిమాలు అటు సైడ్ రావు. ఎందుకంటే..స్టార్ హీరోల సినిమాలకు వెళ్ళడానికి ప్రేక్షకులు ఎక్కువ సుముఖుత చూపిస్తారు. చిన్న సినిమాలో కంటెంట్ ఉన్నా కూడా కలక్షన్స్ రావు. అందుకే ఎందుకు రిస్క్ తీసుకోవడం అని వేరే డేట్ ను వెతుక్కుంటూ ఉంటారు. కానీ, కొంతమంది రిస్క్ అయినా పర్లేదు అని తమ సినిమా మీద, కథ మీద నమ్మకం ఉందని పెద్ద సినిమాను కూడా పట్టించుకోకుండా రిలీజ్ చేస్తూ ఉంటారు. పెద్ద సినిమా నెగెటివ్ టాక్ తెచ్చుకుంటే ఓకే కానీ, అదే పాజిటివ్ టాక్ అందుకొని బ్లాక్ బస్టర్ హిట్ కొడితే మాత్రం.. దాని ఎఫెక్ట్ దాదాపు పదిరోజుల వరకు ఉంటుంది. మధ్యలో ఏ సినిమా వచ్చినా కూడా ప్రేక్షకులు వాటివైపు చూడరు. అలాంటి సందర్భాల్లో చిన్న సినిమాలు రిలీజ్ చేసి ఎఫెక్ట్ అవుతున్నాయి అంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం బబుల్ గమ్ సినిమా పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాలను హీరోగా పరిచయం చేస్తూ.. కె రాఘవేంద్రరావు నిర్మిస్తున్న సినిమా బబుల్ గమ్. ఈ సినిమా డిసెంబర్ 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక రకంగా చెప్పాలంటే.. మొదటి నుంచి ఈ సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. ట్రైలర్, సాంగ్స్ యూత్ ను ఆకట్టుకున్నాయి. ఇక సెలబ్రిటీలు అందరూ సుమకు తెలిసినవారే కాబట్టి ప్రమోషన్స్ కూడా చాలా రిచ్ గా చేస్తూ.. కొడుకు సినిమాకు హైప్ క్రియేట్ చేసింది. అయితే నిన్ననే సలార్ రిలీజ్ అయ్యి భారీ బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ సలార్ ఫీవర్ ఇంకో పదిరోజులు వరకు పోయేలా లేదు. సరే డిసెంబర్ 29 న ఒకటే సినిమా ఉంటే ఓకే కానీ, అదే రోజు కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కింది.. ఈ సినిమా ట్రైలర్ అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ఒక పక్క సలార్ సెగ.. ఇంకోపక్క డెవిల్ పోటీతో సుమ కొడుకు ఎలా నెగ్గుకొస్తాడో అని అందరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి రోషన్ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.