Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈవెంట్లలో అభిమానుల జోష్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆయన పేరు విన్నా హాల్ కుదరదు, ఆ హంగామా చూస్తే ఎవరికైనా షాక్ వస్తుంది. తాజాగా యాంకర్ సుమ కనకాల ఈ విషయాన్నే గుర్తు చేసుకుంది. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ దెబ్బకు తాను శిల్పకలా వేదికలో రెండు సార్లు కిటికీలోంచి దూకి బయటకు వచ్చేశానని యాంకర్ సుమ తెలిపింది. ఆమె తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో సుమ ఆసక్తికర విషయాలు చెప్పింది.
Read Also : Samantha – Rashmika : ఫ్యాన్స్ తో ఆటలాడుతున్న రష్మిక, సమంత.. ఎందుకిలా..?
“పవన్ కల్యాణ్ ఈవెంట్స్ అంటే భారీ సంఖ్యలో ఫ్యాన్స్ వస్తారు. నేను శిల్పకళా వేదికలో ఆయన ఈవెంట్లలో రెండు సార్లు యాంకరింగ్ చేశాను. కానీ అభిమానుల జోష్ మామూలుగా ఉండేది కాదు. వాళ్ల ఉత్సాహం చూస్తే నేను స్టేజ్ నుంచి కిందికి రావడానికి దారి కూడా ఉండేది కాదు. అందుకే మనం బయటకు వెళ్లడానికి దారి లేకపోతే వేరే విధంగా వెళ్లాల్సి ఉంటుంది. చివరికి రెండు, మూడు సార్లు కిటికీలోంచి దూకి బయటకు వచ్చేశా” అని సుమ నవ్వుతూ చెప్పింది.
Read Also : Anupama Parameshwaran : ఆమెపై కేసు పెట్టిన అనుపమ.. అలా చేస్తోందంట
