Anchor Suma : టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా క్రేజ్ తెచ్చుకున్న సుమ కనకాల తన వ్యక్తిగత జీవితంపై చాలా అరుదుగా మాట్లాడుతుంటుంది. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో తన భర్త రాజీవ్ కనకాలతో ఉన్న బంధంపై స్పష్టత ఇచ్చింది. నాకు వచ్చే కలలు చాలా వరకు నిజం అవుతుంటాయి. అలా ఓ సారి రాజీవ్ కు యాక్సిడెంట్ అయినట్టు కల వచ్చింది. వెంటనే కాల్ చేస్తే నిజంగానే యాక్సిడెంట్ అయిందని చెప్పాడు. ఇక మా పెళ్లి బంధంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కున్నాం. పెళ్లి అయి 25 ఏళ్లు అవుతోంది కాబ్టటి ఇన్నేళ్ల జీవితంలో గొడవలు చాలా కామన్. కానీ మేం విడిపోయినట్టు ఎన్నో వార్తలు, రూమర్లు వస్తుంటాయి. మేం విడిపోవాలని చాలా మంది కోరుకున్నారు. కానీ మేం కలిసే ఉంటాం అని తెలిపింది.
Read Also : Actor Janardhan : 18 ఏళ్లు ఆమెతో ఎఫైర్ నడిపా.. నా భార్య సపోర్ట్ చేసింది
మా పెళ్లి ప్రయాణంలో చిన్న చిన్న విభేదాలు, గొడవలు ఉండటం చాలా సహజం. అయితే ప్రతి సారి మీడియాలో ‘సుమ-రాజీవ్ విడిపోయారు’ అనే రూమర్లు వస్తూనే ఉన్నాయి. కానీ ఆ వార్తల్లో అసలు నిజం లేదు. మేం తరచూ రీల్స్ వీడియోలు చేసి షేర్ చేస్తూనే ఉంటాం. అయినా సరే మా మీద ఇలాంటి రూమర్లు అస్సలు ఆగట్లేదు. ఇప్పుడు మా పిల్లలు పెద్దవాళ్లు అయ్యారు. ఇన్ని రోజులు పిల్లలు, ఫ్యామిలీతో పాటు ఇటు కెరీర్ ను బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పటికీ ఇంత ఎనర్జిటిక్ గా ఉన్నాను అంటే అది రాజీవ్ ఇచ్చిన సపోర్ట్ వల్లే. అతనికి నేను ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంటానో.. నా వర్క్ కు అతను కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తుంటాడు అని తెలిపింది సుమ.
Read Also : Rashmika-Vijay Wedding: విజయ్ దేవరకొండనే పెళ్లి చేసుకుంటా.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన రష్మిక
