Site icon NTV Telugu

Sukumar: ఆ ముగ్గురి కలయికకు కారణం ఏమిటో!?

Sukumar

Sukumar

Sukumar: ముగ్గురు ప్రముఖ దర్శక నిర్మాతల కలయికలో కొత్త సినిమా రూపుదిద్దుకోనుంది. ‘పుష్ప’తో పాన్ ఇండియా స్థాయిలో ఖ్యాతి గడించిన తెలుగు దర్శకుడు సుకుమార్, సంచలనమైన చిత్రాలను రూపొందించడంలో పేరు తెచ్చుకొని ‘కాశ్మీర్ ఫైల్స్‌’తో దేశవ్యాప్తంగా పాపులరైన బాలీవుడ్ దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి, ‘కాశ్మీర్ ఫైల్స్‌ కార్తికేయ 2’ వంటి పాత్ బ్రేకింగ్ సినిమాలు నిర్మించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అధినేత అభిషేక్ అగర్వాల్… ఈ ముగ్గురు కలసి పని చేయబోతున్నారు. ఇటీవల ఈ ముగ్గురూ సమావేశమై ప్రాజెక్ట్ గురించి చర్చించారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి వివరాలను వారు వెల్లడించలేదు. అయితే అత్యద్భుతమైన ఈ ముగ్గురు సహకారంతో రాబోతున్న చిత్రం ఎక్సయింటింగ్ ప్రాజెక్ట్ కానుంది. అభిషేక్ అగర్వాల్, వివేక్ అగ్నిహోత్రి కలిసి భారీ బ్లాక్ బస్టర్ ‘ది కాశ్మీర్ ఫైల్స్’ అందించారు. వీరిద్దరూ కలిసి మరో రెండు ప్రాజెక్ట్స్‌లో పని చేస్తున్నారు. ఈలోగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని ప్రకటించారు.

‘సినిమాతో ఇండియాని ఏకం చేయడం. వివరాలు త్వరలో. ఊహించండి!?’ అంటూ వివేక్ తమ సమావేశానికి సంబంధించిన ఫోటోను ట్వీట్ చేశారు. మరి ఈ ఇద్దరు డైరెక్టర్స్ లో ఎవరు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారో చూడాలి.

Exit mobile version