Site icon NTV Telugu

ఆయన చెప్పబట్టే పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తున్నాం

sukumar

sukumar

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 17 న ఈ సినిమా విడుదలకు సిద్దమవుతుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో పుష్ప టీమ్ ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసింది. మీడియాతో మమేకమయిన పుష్ప టీమ్ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. పుష్ప పాన్ ఇండియా మూవీగా ఎలా మారిందో దర్శకుడు సుకుమార్ తెలిపారు.

” నేను ఈ సినిమాను తెలుగు సినిమాలాగే తీద్దామని అనుకున్నాను . అసలు అప్పుడు పాన్ ఇండియా మూవీ అనే ఆలోచన రాలేదు. అయితే ఎలా తెలిసిందో , ఏమో దర్శక ధీరుడు రాజమౌళి కి ఈ విషయం తెలిసి నాకు ఫోన్ చేసి మాట్లాడారు. పాన్ ఇండియా మూవీ గా తీయండి అన్నారు.. నేను ఈ సినిమాను తెలుగు సినిమాలాగే చూశానని చెప్పాను .. అప్పుడు రాజమౌళి .. మీరు ఈ సినిమాను పాన్ ఇండియా మూవీలా చూస్తే పాన్ ఇండియా లా కనిపిస్తోంది.. తెలుగు సినిమాలా చూస్తే తెలుగు సినిమాలానే కనిపిస్తోంది అని చెప్పారు.. అప్పుడు ఈ సినిమాను పాన్ ఇండియాలా చూడడం మొదలుపెట్టాను” అంటూ చెప్పుకొచ్చారు. పుష్ప పాన్ ఇండియా కథ వెనుక ఉన్న వ్యక్తి దర్శక ధీరుడు అన్నమాట..

Exit mobile version