‘పుష్ప’ చిత్రంతో అల్లు అర్జున్ తో హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు సుకుమార్. ఈ సినిమా రిలీజ్ అయ్యి మిశ్రమ స్పందన అందుకున్నా కలెక్షన్లు మాత్రం రికార్డు స్థాయిలో ఉన్నాయి. ఇక వచ్చే యాదాద్రి నుంచి ‘పుష్ప పార్ట్ 2’ ని మొదలు పెట్టనున్న సుకుమార్ .. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి నోరువిప్పారు. అందరు ఎంతగానో ఎదురుచూస్తున్న కాంబో రామ్ చరణ్ – సుకుమార్ . రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ ని చెర్రీ కి అందించిన సుకుమార్ తన తదుపరి సినిమాలో ఒకటి రామ్ చరణ్ తో ఉండనుందని ప్రకటించాడు. ఇది రంగస్థలానికి కొనసాగింపా ..? లేదా మరో కొత్త కథతో రాబోతున్నాడా ..? అనేది తెలియాలి.
ఇక చిత్ర పరిశ్రమ అస్సలు ఊహించని కాంబో త్వరలో తెరపై కనిపించనుంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ఒక చిత్రాన్ని చేయబోతున్నట్లు సుకుమార్ అధికారికంగా ప్రకటించాడు. ఈ సినిమా పుష్ప 2 తరువాత మొదలు కానున్నదట. ఇప్పటికే సుకుమార్ హీరోలు ఏ రేంజ్ లో ఉంటారో అందరికి తెలిసిందే. ఇక రౌడీ హీరో ని సుకుమార్ ఏ రేంజ్ లో చూపిస్తాడో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ లైగర్ సినిమాను ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా తరువాత సుక్కు సినిమా మొదలు కానున్నది. మరి ఈ హీరోలకు సుకుమార్ ఎలాంటి హిట్ ని అందిస్తాడో చూడాలి.
