Site icon NTV Telugu

మహేష్ ను కలిసిన సుకుమార్… అందుకేనా ?

Sukumar Met Mahesh babu during an Recent Ad shoot

సూపర్‌స్టార్ మహేష్ బాబును క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలవడం ఇప్పుడు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. అయితే వారిద్దరూ ఇప్పుడు ఎందుకు కలిశారంటే… మహేష్ గత రోజు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో యాడ్ కమర్షియల్ షూటింగ్‌లో ఉన్నారు. సుకుమార్ సినిమా కూడా సమీపంలోనే షూటింగ్ జరుగుతోంది. “సర్కారు వారి పాట”కు వచ్చిన రెస్పాన్స్ ను చూసి మహేష్ ను అభినందించడానికి సుకుమార్ అక్కడకు వెళ్లారని తెలుస్తోంది. ఈ సందర్భంగా వారిద్దరూ ఒకరితో ఒకరు చాలా సేపు మాట్లాడుకున్నారు.

Read Also : “అఖండ”లో ఆ సీన్స్ కోసమే ఏకంగా 80 రోజులు!

సుకుమార్ గతంలో మహేష్ బాబు హీరోగా “1 నేనొక్కడినే” చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం హిట్ అవ్వలేదు. కానీ ఒక మంచి ప్రయత్నంగా ప్రశంసలు మాత్రం పొందింది. ఆ తరువాత మహేష్, సుకుమార్ కాంబోలో మరో సినిమాను తెరకెక్కించాలని భావించారు. ఈ మేరకు ప్రాజెక్ట్ ను కూడా ప్రకటించారు. కానీ అది సెట్స్‌కి వెళ్లకముందే ఆగిపోయింది. తాజా బజ్ ఏమిటంటే సుకుమార్ అదే స్క్రిప్ట్‌ను అల్లు అర్జున్ వద్దకు తీసుకెళ్లి “పుష్ప” టైటిల్ తో చేస్తున్నాడు. ఆ తర్వాత కూడా వారి మధ్య నేహబంధం అలాగే కొనసాగుతోంది. ఇక వచ్చే ఏడాది సంక్రాంతికి “సర్కారు వారి పాట” విడుదల కానుండగా, “పుష్ప” మొదటి భాగం క్రిస్మస్‌కు రిలీజ్ కానుంది.

Exit mobile version