Site icon NTV Telugu

Sukumar : రామ్ చరణ్‌ కోసం పనులు మొదలెట్టిన సుకుమార్

Game Changer Sukumar Review

Game Changer Sukumar Review

Sukumar : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోసం సుకుమార్ రంగంలోకి దిగిపోయాడు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా మార్కెట్లో ప్రభంజనం సృష్టించిన లెక్కల మాస్టర్.. ఇప్పుడు రామ్ చరణ్‌ కోసం సాలీడ్ కథను రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. రామ్ చరణ్‌ కూడా ఓ వైపు పెద్ది సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆ సినిమా వచ్చే సమ్మర్ లో రిలీజ్ అవుతుంది. ఆ మూవీ షూటింగ్ అయిపోయేలోపు ప్రీ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేయాలని సుకుమార్ భావిస్తున్నాడు.

Read Also : OG : ఏపీలో పవన్ ఫ్యాన్స్ అలెర్ట్.. ఓజీ ప్రీమియర్స్ టైమ్ ఛేంజ్..

అందుకే ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో చాలా బిజీగా ఉన్నాడు. డిసెంబర్ వరకల్లా స్క్రిప్ట్ పనులు కంప్లీట్ చేసేసి ప్రీ ప్రొడక్షన్ పనుల్లోకి వెళ్లిపోవాలని డిసైడ్ అవుతున్నాడు సుకుమార్. ఫిబ్రవరి ఎండింగ్ లోపు షూటింగ్ స్టార్ట్ చేయాలని భావిస్తున్నాడంట. అందుకే పనులు స్పీడ్ గా చేస్తున్నట్టు సమాచారం. ఈ సారి కూడా రామ్ చరణ్‌ తో భారీ వెయిట్ ఉన్న సినిమానే ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. అది మరో లెవల్ లో ఉంటుందని టాక్.

Read Also : Ranbir Kapoor: రణ్ బీర్ కపూర్ పై కేసు.. NHRC ఆదేశాలు

Exit mobile version