NTV Telugu Site icon

Sukumar- Dil Raju: నేనున్నా.. దిల్ రాజుకు సుక్కూ అభయం!

Sukumar Dil Raju

Sukumar Dil Raju

Sukumar Assures Dil Raju about Asish Reddy Selfish Movie: డైరెక్టర్ సుకుమార్ శిష్యులు చాలామంది దర్శకులుగా మారి తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. మరి కొంతమంది సుకుమార్ శిష్యులు దర్శకులుగా మారినా పెద్దగా క్రేజ్ తెచ్చుకోలేకపోతున్నారు. అయితే ఇప్పుడు దర్శకుడిగా మారేందుకు ప్రయత్నించిన సుకుమార్ శిష్యుడు సినిమా గురించి సుకుమార్ దిల్ రాజుకు హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సుకుమార్ శిష్యుడు కాశి దిల్ రాజు తమ్ముడి కొడుకు ఆశిష్ రెడ్డి హీరోగా సెల్ఫిష్ అనే సినిమా అనౌన్స్ చేశారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు చాలా వరకు పూర్తయిన తర్వాత ఈ సినిమా అవుట్ పుట్ నచ్చక, ఆపేసి లవ్ మీ సినిమాని తెరమీదకు తీసుకొచ్చారు. ఆ సినిమా కూడా ఊహించిన మేర ఫలితాలను అందుకోలేకపోయింది. అయితే సెల్ఫిష్ మొత్తాన్ని షెల్వ్ చేసేసినట్లు ప్రచారం జరుగుతున్న సందర్భంలో ఒక ఆసక్తికరమైన వార్త తెర మీదకు వచ్చింది.

Raja Saab: నన్నిక విసిగించద్దు బాబోయ్!!

అదేంటంటే ఈ మధ్యనే సుకుమార్ స్పెషల్గా దిల్ రాజును కలిసాడట. కలిసి పుష్ప 2 పూర్తయ్యే వరకు ఆగాలని, ఆ హడావుడి నుంచి తాను బయటపడితే ఒక నెలరోజుల పాటు సెల్ఫిష్ మీద కూర్చుని ఆ సినిమాని ఒక దారికి తీసుకొస్తానని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఎలాగో చేయాల్సిన షూటింగ్ అంతా చేసేసారు, పెట్టాల్సిన ఖర్చు అంతా పెట్టేశారు. కాబట్టి దాన్ని వృధా చేయకుండా తాను ప్రేక్షకులకు అనుగుణంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సుకుమార్ ఆ పని చేసి పెడితే తాను కూడా హ్యాపీనేనని దిల్ రాజు చెప్పినట్లుగా తెలుస్తోంది. కాబట్టి ఆశిష్ రెడ్డి హీరోగా ప్రేక్షకులు ముందుకు రావాల్సిన సెల్ఫిష్ వచ్చే ఏడాదిలో అయినా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సుకుమార్ పుష్ప 2 సినిమా డిసెంబర్ 6వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి వచ్చే ఏడాది మొదట్లో ఈ సినిమా మీద కూర్చుని సమ్మర్ నాటికి ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది.

Show comments