NTV Telugu Site icon

Pushpa 2: గంగమ్మ జాతరకి సుకుమార్ సిద్ధం…

Pushpa 2 Release Date

Pushpa 2 Release Date

పుష్ప2 ఫస్ట్ లుక్‌లో అమ్మవారి గెటప్‌లో కనిపించి ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. సినిమాలో బన్నీ అమ్మవారిగా కనిపించే ఎపిసోడ్ పీక్స్‌లో ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇప్పటికే పుష్ప2 చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఆ మధ్య లీక్ అయిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. ఇక మూడు నిమిషాల వీడియోలో పుష్పరాజ్‌కు సుకుమార్ ఇచ్చిన ఎలివేషన్.. సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేసేలా చేసింది. ఆగష్టు 15న పుష్ప2 రిలీజ్ కానుంది. ఇప్పటికే కొన్ని భారీ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా… ఇప్పుడు మరో భారీ షెడ్యూల్‌ షూట్‌కి రెడీ అవుతోంది. నిన్న మొన్నటి వరకు నేషనల్ అవార్డ్, వరుణ్ తేజ్ పెళ్లి కోసం షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చిన అల్లు అర్జున్… ఇప్పుడు పుష్ప2 షూటింగ్‌లో జాయిన్ అవనున్నాడు.

నవంబర్‌ 2 నుంచి ఈ కొత్త షెడ్యూల్‌ స్టార్ట్ చేయనున్నారు. దీనికోసం భారీ జాతర సెట్‌ వేశారట. ఇప్పటి వరకు జరిగిన వాటిలో ఇదే చాలా పెద్ద షెడ్యూల్‌ అని తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌లో భారీ ఫైట్‌తోపాటు, యాక్షన్‌ సీన్‌కి ముందు వచ్చే సీన్లని చిత్రీకరించనున్నారట. అలాగే… ఓ సాంగ్‌ షూట్ కూడా ప్లాన్‌ చేసినట్టు సమాచారం. మొత్తంగా లేటెస్ట్ షెడ్యూల్ సినిమాలో మేజర్‌ పార్ట్ అని తెలుస్తోంది. దీంతో… ఈసారి పుష్పరాజ్ చేసే రచ్చ ఎలా ఉంటుందో చూడాలని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఖచ్చితంగా అంచనాలకు మించి ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. బన్నీకి జోడీగా రష్మిక హీరోయిన్‌గా నటిస్తుండగా, ఫహద్‌ ఫాజిల్‌ నెగటివ్‌ రోల్‌ చేస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.