Mahathi Movie Opening: యంగ్ టాలెంటెడ్ హీరో సందీప్ మాధవ్ కథానాయకుడిగా శివప్రసాద్ స్వీయ దర్శకనిర్మాణంలో శ్రీ పద్మిని సినిమాస్ ప్రొడక్షన్ నెంబర్ 3గా రూపొందుతున్న ‘మహతి’ ఈ రోజు పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభమైంది. సుహాసిని మణిరత్నం, దీప్సిక కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి చంద్రమౌళి క్లాప్ కొట్టగా, పద్మ కెమెరా స్విచాన్ చేశారు. సుహాసిని మణిరత్నం మేకర్స్ కి స్క్రిప్ట్ ని అందించగా తొలి షాట్ కి రాజారవీంద్ర గౌరవ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా లాంచింగ్ ఈవెంట్ లో సుహాసిని మణిరత్నం మాట్లాడుతూ.. మహతి సినిమా ముహూర్తంలో అందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని, తన తొలి సినిమా విడుదలై నేటికి సరిగ్గా 43 ఏళ్ళు అవుతుందని అన్నారు. పరిశ్రమలో 44 ఏడాది మహతి సినిమాతో ప్రారంభిస్తున్నా, ఇప్పటివరకూ కెరీర్లో ఎన్నో చిత్రాలు చేశా, ఎన్నో జయపజయలు చూశా అవన్నీ గతంలోనే వదిలేసి ఇప్పుడు తొలి సినిమా చేస్తున్న అనుభూతితోనే ఈ సినిమా చేస్తున్నాను.
Mahesh Babu: కూతురుతో సూపర్ స్టార్.. భలే ముద్దుగా ఉన్నారే
తెలుగు సినిమాలో చేయడం ఒక అలవాటుగా మారిందన్న ఆమె కథ, పాత్ర నచ్చితేనే సినిమా చేస్తా, మహతి కథ, నా పాత్ర చాలా నచ్చిందని అన్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్, సెంటిమెంట్స్ ఉంటాయని టైటిల్ కి తగట్టు మహిళా ప్రాధాన్యత గల చక్కని అంశాలు ఉన్నాయని అన్నారు. ఒక క్రైమ్ చేయడం కంటే ఆ క్రైమ్ ని చూస్తూ ఏం చేయకుండా ఊరుకోవడం ఇంకా పెద్ద క్రైమ్ అనేదే ఈ సినిమా ప్రధానాంశం. ఇక హీరో సందీప్ మాధవ్ మాట్లాడుతూ మహతి కథ విన్నప్పుడు చాలా ఎక్సైటింగ్ గా ఫీలయ్యా, డైరెక్టర్ శివ ఆద్యంతం ఆకట్టుకునేలా ఈ కథని తీర్చిదిద్దారని, నా పాత్రకు డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని, చాలా అద్భుతంగా డిజైన్ చేశారని అన్నారు. సుహాసినితో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది, ఖచ్చితంగా సినిమా ప్రేక్షకులని అలరిస్తుందన్నారు