NTV Telugu Site icon

Suhasini: ఆ హీరో ఒళ్ళో కూర్చొని ఎంగిలి ఐస్ క్రీం తినమన్నారు!

Suhasini Maniratnam recalls refusing to sit on hero’s lap and to eat ice cream: నటి సుహాసిని మణిరత్నం, తమిళ ప్రముఖ దర్శకుడు నిర్మాత మణిరత్నం భార్య. ఆమె ఇటీవల సెట్‌లో తాను చాలా అసౌకర్యంగా ఉన్నందున ఒక సీన్ చేయడానికి తాను ఎలా నిరాకరించానో వివరించింది. హీరో ఒడిలో కూర్చుని అతను తింటున్న ఐస్‌క్రీమ్‌ను తాను తినాల్సినట్టు డైరెక్టర్ చెప్పారని ఆ సమాయంలో తాను చాలా ఇబ్బంది పడ్డానని ఆమె చెప్పుకొచ్చారు. సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో సుహాసిని తన అనుభవాన్ని గురించి మాట్లాడుతూ, “నన్ను హీరో ఒడిలో కూర్చోమని అడిగారు, నేను నిరాకరించాను’’ అని అన్నారు. ఇది ఒక పార్కులో షూట్ చేస్తున్నారు భారతదేశంలో, 1981లో, పార్క్‌లో ఏ స్త్రీ పురుషుడి ఒడిలో కూర్చోదు కాబట్టి నేను అక్కడ కూర్చోను’ అని చెప్పానని అన్నారు.

Martin Luther King: అక్టోబర్ 27న ‘మార్టిన్ లూథర్ కింగ్’

అతను ఐస్ క్రీం తింటూ నాకు తినిపిస్తున్న షాట్ కూడా చేయమన్నారు, నేను వద్దు అన్నాను, నాకు అదే ఐస్ క్రీం వద్దు, ఆ సీన్ మార్చండి లేదా నాకు మరో ఐస్ క్రీం తీసుకురండి అని చెప్పానని అన్నాను. అలా చెబితే నా డ్యాన్స్ డైరెక్టర్ ఆశ్చర్యపోయాడు, మీరు అలా తిరస్కరించకూడదు కదా అని అంటే నేను ఐస్ క్రీంను తిరస్కరించగలను, అసలు నేను దానిని తాకనని కూడా చెప్పనని అన్నారు.” ఇలాంటి విషయంలో తనకు మద్దతు ఇచ్చే వ్యక్తిని సెట్‌లో ఎప్పుడూ ముందే ఒకరిని కనుగొంటానని ఆమె చెప్పుకొచ్చారు. తన సహనటి శోభనకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైందని సుహాసిని అన్నారు. మలయాళ చిత్రాల్లో నటించిన జాతీయ అవార్డు గ్రహీత నటి శోభన ఒక సీన్ చేయడానికి నిరాకరించినప్పుడు సుహాసినిలా ఎందుకు ప్రవర్తిస్తున్నారని అడిగారట. నేను ఇప్పటికీ శోభన అంశాన్ని గుర్తుంచుకుంటానని అన్నారు.

Show comments