Martin Luther King: అక్టోబర్ 27న ‘మార్టిన్ లూథర్ కింగ్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Martin Luther King to Release on October 27th: వైనాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సగర్వంగా సమర్పిస్తున్న “మార్టిన్ లూథర్ కింగ్” రిలీజ్ కి రెడీ అవుతోంది. మహాయాన మోషన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి పూజ కొల్లూరు దర్శకత్వం వహించగా సంపూర్ణేష్ బాబు, వి.కె. నరేష్, శరణ్య ప్రదీప్ వంటి ప్రతిభావంతులైన నటీనటులు నటించారు. కామెడీ ప్రధానంగా రూపొందిన ఈ రాజకీయ వ్యంగ్య సినిమా టీజర్ గాంధీ జయంతి రోజున విడుదలై అద్భుతమైన స్పందన పొందింది. తెలుగు సినిమాల్లో ఇది కొత్త అనుభూతిని ఇస్తుందని ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు నటుడిగా ఆకర్షణీయమైన ఓ కొత్త పాత్రలో అలరించనున్నారని అంటున్నారు. అక్టోబర్ 9 నుండి సినిమా యూనిట్ ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ పర్యటనను ప్రారంభించి విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, కర్నూలు మరియు వరంగల్ వంటి నగరాల్లో ముందస్తు ప్రీమియర్ షోలను ప్రదర్శించగా ఈ ప్రీమియర్‌లకు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభిస్తోంది. ఇక ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ అక్టోబర్ 18న విడుదల కానుంది.
Leo Plot: ఎల్సీయూ కాదు.. అసలు కథ లీకయ్యిందిగా?
Also Read
- Dhanush OM: రజినీ కోసం స్టార్ హీరో ధనుష్ బిగ్ డెసిషన్.. ‘జైలర్ 2’తో పోటీ వద్దంటూ సంచలన ప్రకటన!
- The Paradise: నాని కెరీర్లోనే రికార్డ్ ఓపెనింగ్ దిశగా ‘ది ప్యారడైజ్’.. రిలీజ్‌కు ముందే కోటి దాటేసిన సినిమా!
- Ram Charan: "మన కుటుంబాన్ని మార్చేసిన ఆ రోజును మర్చిపోలేం నాన్న" చిరంజీవిపై రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్..
- Sumalatha: జానీ మాస్టర్ భార్య సుమలతపై దాడి?
అలాగే ఆ వీకెండ్ లో విడుదలవుతున్న భారీ చిత్రాలతో పాటు అక్టోబర్ 19 నుంచి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో 400 థియేటర్లలో ట్రైలర్ ప్రదర్శించబడుతుంది. ఈ ‘మార్టిన్ లూథర్ కింగ్’ ఒక స్థానిక చెప్పులు కుట్టే వ్యక్తి కథ, తను నివసించే గ్రామంలో ఎన్నికలు వస్తాయి. ఇద్దరు ప్రత్యర్థులు ఎలాగైనా గెలవాలని పోటీ పడతారు. అయితే ఆ ఎన్నికల్లో అతని ఓటు, గెలుపు నిర్ణయించే ఓటు కావడంతో ఒక్క రాత్రిలో అతని జీవితం మలుపు తిరుగుతుంది. తమిళంలో తెరకెక్కిన మండేలా సినిమాకి ఇది రీమేక్. ‘మార్టిన్ లూథర్ కింగ్’ 2023, అక్టోబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఆంధ్రప్రదేశ్ – తెలంగాణలో పంపిణీ భాగస్వామిగా వ్యవహరిస్తుందని ఏపీ ఇంటర్నేషనల్ ఓవర్సీస్ పంపిణీ భాగస్వామిగా ఉంటుందని అంటున్నారు.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!