NTV Telugu Site icon

Suhas: ఏదైమైనా సుహాస్ తెలివి.. ఆర్. నారాయణమూర్తికే సారీ చెప్పి..

Narayana

Narayana

Suhas: కలర్ ఫోటో హీరో సుహాస్.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది రైటర్ పద్మభూషణ్ సినిమాతో మంచి హిట్ అందుకున్న సుహాస్ .. ప్రస్తుతం అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ అంటూ వస్తున్నాడు. దుశ్యంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సుహాస్ సరసన శివాని హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇప్పటికే పోస్టర్స్ తో అటెన్షన్ గ్రాబ్ చేసిన మేకర్స్ .. నేడు ఈ సినిమా టీజర్ ను హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో రిలీజ్ చేశారు. ఇక ప్రస్తుతం సినిమాలో కథను బట్టి బయట ప్రమోషన్స్ కూడా అలాగే చేయడానికి రెడీ అవుతున్నారు చిత్ర బృందం. తాజాగా ఈ చిత్ర బృందం కూడా టైటిల్ కు తగ్గట్టుగానే అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ మోగిస్తూ.. ప్రసాద్ ల్యాబ్స్‌ కు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఇక్కడ వరకు బాగానే ఉన్నా.. ప్రసాద్ ల్యాబ్స్‌ కు కొంచెం దగ్గర్లో ఉన్న నటుడు ఆర్. నారాయణమూర్తి కి ఈ సౌండ్ చాలా చిరాకు తెప్పించిందట. దీంతో ఏంటి సౌండ్స్ అని ఆయన కొద్దిగా కోపగించుకోవడంతో.. విషయం తెలుసుకున్న సుహాస్.. ఆర్. నారాయణమూర్తి వద్దకు స్వయంగా వెళ్లి క్షమాపణలు కోరినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన.. ఆలా ఏం లేదు .. సౌండ్ పొల్యూషన్ వద్దు అని చెప్పి పంపించాడట.

Indian 2: ఇది డబ్బింగ్ ఓకే.. మరి మా గేమ్ ఛేంజర్ పరిస్థితి ఏంటి శంకరూ.. ?

ఇక ఈ సినిమా గురించి సుహాస్ మాట్లాడుతూ.. “అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమా ఇంత బాగా రూపుదిద్దుకోవడానికి మా ప్రొడ్యూసర్స్ కారణం. ధీరజ్ గారు మాకు కావాల్సిన సపోర్ట్ ఇచ్చి ఎంకరేజ్ చేశారు. అలాగే ఇంత మంచి కథను నా దగ్గరకు తీసుకొచ్చిన దుశ్యంత్ కు థ్యాంక్స్ చెబుతున్నా. లక్ష్మీ క్యారెక్టర్ లో బాగా నటించింది నా కోస్టార్ శివానీ. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, ఎడిటింగ్ ..ఇలా ప్రతి డిపార్ట్ మెంట్ ఔట్ పుట్ సూపర్బ్ గా ఇచ్చారు. నా డైరెక్టర్స్ నా కెరీర్ ను ఒక్కో ఇటుక పేర్చి ఇళ్లులా తీర్చిదిద్దారు. మా ఊరిలో గృహప్రవేశం టైమ్ లో కుంకుమ నీళ్లలో అరచేతిని అద్ది కొత్త ఇంటికి గోడకు అచ్చు వేస్తారు. ఆ అచ్చు అలాగే చిరకాలం ఉండిపోతుంది. నా కెరీర్ లో అలాంటి అచ్చు లాంటి సినిమా అంబాజీపేట మ్యారేజి బ్యాండు” అని చెప్పుకొచ్చాడు. మరి ఈ సినిమాతో సుహాస్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Show comments