Site icon NTV Telugu

Suhas Cable Reddy: నవ్వులతో గుండెకి కనెక్షన్ ఇచ్చేస్తాడు ఈ కేబుల్ రెడ్డి

Cablereddy

Cablereddy

Suhas Cable Reddy Movie first look Poster unveiled: వెరీ టాలెంటెడ్ యాక్టర్ గా చేసిన కొన్ని సినిమాలతోనే నిరూపించుకున్న సుహాస్ తన చిత్రాల ఎంపికతో సర్ ప్రైజ్ చేస్తూ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. కెరీర్ ప్రారంభం నుంచీ యూనిక్ సబ్జెక్ట్‌లను ఎంచుకుంటున్న ప్రస్తుతం చేస్తున్న మూవీ ‘కేబుల్ రెడ్డి’. శ్రీధర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఫ్యాన్ మేడ్ ఫిలింస్ బ్యానర్‌పై బాలు వల్లు, ఫణి ఆచార్య, మణికంఠ జెఎస్‌ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్లో సుహాస్ ని ‘కేబుల్ రెడ్డి’ గా టైటిల్ రోల్ లో ప్రజెంట్ చేశారు. టైటిల్, ఫస్ట్-లుక్ పోస్టర్ సుహాస్ కేబుల్ డిష్ ఓనర్ పాత్రలో నటిస్తున్నట్లు సూచిస్తుండగా పోస్టర్ లో 2000వ దశకం ప్రారంభంలో వాడిని చాలా పోర్టబుల్ టీవీలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Trisha: ఆ నిర్మాతతో పెళ్లంటూ ప్రచారం.. త్రిష మాస్ వార్నింగ్

దీంతో అప్పటి సమయానికి చెందిన కథ అయి ఉండవచ్చని అంటున్నారు. సుహాస్ షేడ్స్‌ ధరించి చిరునవ్వుతో పోర్టబుల్ టీవీలపై సేదతీరుతున్నట్లు కనిపించారు. ఇక సినిమా ఫన్ రైడ్ గా వుండబోతుందని మేకర్స్ చెబుతుండగా ఇక తాజా పోస్టర్‌లో సుహాస్ ఎరుపు చొక్కా, నలుపు ఫార్మల్ ప్యాంట్‌లో సాధారణ గ్రామ యువకుడిగా కనిపిస్తునందు. ఇక ఈ సినిమాలో సుహాస్‌కు జోడిగా షాలిని కొండేపూడి అనే అమ్మాయి హీరోయిన్ గా నటిస్తోంది. స్మరణ్ సాయి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మహి రెడ్డి పండుగుల్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మిగిలిన నటీనటులు, టెక్నికల్ టీం ను మేకర్స్ త్వరలో అనౌన్స్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

Exit mobile version