NTV Telugu Site icon

Suhas: బ్యాండు సౌండ్ మాములుగా లేదు మావా…

Suhas

Suhas

సుహాస్ హీరోనా? అనే మాట నుంచి… సుహాస్ నుంచి సినిమా వస్తుందంటే, ఓ మంచి సినిమా వచ్చినట్టేనని… ఆడియెన్స్ ఎదురు చూసేలా చేశాడు సుహాస్. కలర్ ఫోటో సినిమాతో హీరోగా సత్తా చాటిన సుహాస్… తనకంటు ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకొని సినిమాలు చేస్తున్నాడు. ప్రతి సినిమాను ఫీల్ గుడ్ మూవీలా చేస్తు.. ఎమోషనల్ టచ్ ఇస్తున్నాడు. హిట్ 2 సినిమాలో విలన్‌గా కూడా మెప్పించిన సుహాస్… చివరగా రైటర్ పద్మభూషన్ సినిమాతో అలరించాడు. ఇక ఇప్పుడు అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు అనే సినిమాతో ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దర్శకుడు దుశ్యంత కటికనేని తెరకెక్కించిన ఈ చిత్రం ట్రైలర్‌ని లేటెస్ట్‌గా రిలీజ్ చేశారు. సినిమా టైటిల్ చూసి ఇది పక్కా ఎంటర్టైన్మెంట్ సినిమా మాత్రమేనని అనుకున్నారు.

Read Also: Dubbing Movies: ‘అయలాన్’ సరే… మరి కెప్టెన్ మిల్లర్ ఎక్కడ?

ట్రైలర్ చూసిన తర్వాత అంబాజీ పేట మ్యాటర్ వేరే అని అంచనాలు పెంచేశారు. హీరో, హీరోయిన్ల మధ్య బ్యూటీఫుల్ లవ్‌స్టోరీతో మొదలైన ట్రైలర్… మెయిన్ పాయింట్‌లోకి వెళ్ళాక ఆసక్తిగా మారింది. లవ్ ట్రాక్‌ టు సిస్టర్ సెంటిమెంట్‌గా టర్న్ ఇచ్చిన ట్రైలర్ ప్రకారం… అక్క విషయంలో ఎదురయ్యే పరిస్థితులను హీరో ఎలా ఎదుర్కొన్నాడు? అక్కకు తన లవ్ స్టోరీకి ఏంటి సబంధం? అనేలా ట్రైలర్‌ను ప్రామిసింగ్‌గా కట్ చేశారు. ఖచ్చితంగా ఈ సినిమాతో సుహాస్… ఒక కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్ లాంటి ఎమోషనల్ ట్రీట్ ఇవ్వడం గ్యారెంటీగా కనిపిస్తోంది. సుహాస్ కూడా కొత్తగా కనిపిస్తున్నాడు. మొత్తంగా… అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు హిట్ అనే హింట్‌ ఇచ్చేసింది ట్రైలర్.

Ambajipeta Marriage Band Trailer | Suhas, Shivani | Dushyanth | Dheeraj | Feb 2nd Release