Site icon NTV Telugu

Suhana Khan : బ్యాక్‌లెస్ బ్లాక్ డ్రెస్‌… మతి పోగొడుతున్న కింగ్ ఖాన్ డాటర్ !

Suhana

Suhana Khan… కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ డాటర్ వెండితెర అరంగ్రేటం ఇవ్వకముందే స్టార్ హీరోయిన్ కు ఉండాల్సినంత ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. చదువుకుంటున్న సమయం నుంచే సోషల్ మీడియాలో సెగలు పుట్టించేలా చిట్టిపొట్టి బట్టలతో కన్పించి అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. తాజాగా బ్యాక్‌లెస్ బ్లాక్ డ్రెస్‌ ఆమె షేర్ చేసిన ఓ ఫోటో కుర్రాళ్ళ మతులు పోగొడుతోంది. ఇంతకుముందు వరకూ కాస్త బొద్దుగా కన్పించిన ఈ అమ్మడు ఇప్పుడు సన్నబడినట్టుగా కన్పిస్తోంది. ఆమె మినిమలిస్టిక్ మేకప్‌తో బ్యాక్‌లెస్ గౌను ధరించి అందరి కళ్ళు తనవైపుకు తిప్పుకుంది. ఈ పిక్ కు బ్లాక్ హార్ట్‌తో క్యాప్షన్ ఇచ్చింది.

Read Also : Beast : రాఖీ భాయ్ తో ఢీకి రెడీ… ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన విజయ్

ఇక సుహానా ఖాన్ ప్రస్తుతం ముంబైలో తన తొలి చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉంది. స్టార్ డాటర్ అయినప్పటికీ గ్లామర్ ఒలకబోయడంలో తెగడేలేదంటోంది ఈ బ్యూటీ. ఇప్పటికే బీ టౌన్ లో ఎంట్రీ ఇచ్చిన స్టార్ డాటర్స్ జాహ్నవి కపూర్, అనన్య పాండే వంటి వారు మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. స్టార్ హీరోయిన్లుగా మంచి మంచి ఆఫర్లు పట్టేస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. మరి సుహానా తన మొదటి చిత్రంతో ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Exit mobile version