రెండు జంటల ప్రేమకథతో ‘సుగ్రీవ’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వంశీ, అనిల్, కృష్ణప్రియ హీరోహీరోయిన్లుగా తెరకెక్కబోతున్న సినిమా ‘సుగ్రీవ’. మధుసూదన్ రెడ్డి, ఏడుకొండలు రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు కొత్తపల్లి నగేశ్ దర్శకుడు. ఈ సినిమా ప్రారంభోత్సవం శుక్రవారం రామానాయుడు స్టూడియోస్ లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి రచయిత, దర్శకుడు బి.వి.ఎస్. రవి క్లాప్ ఇవ్వగా, నటుడు మహేశ్ కెమెరా స్విచ్చాన్ చేశారు.
ఈ సందర్భంగా నిర్మాతలు మధుసూదన్ రెడ్డి, ఏడుకొండలు రెడ్డి మాట్లాడుతూ ”దర్శకుడు కొత్తపల్లి నగేష్ ఇదివరకే చాలా సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇప్పుడు మా తొలి నిర్మాణంలో ‘సుగ్రీవ’ చిత్రానికి దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు. అందరూ మెచ్చే కథతో వస్తున్నాం. ఆదరిస్తారని ఆశిస్తున్నాం” అని అన్నారు. దర్శకుడు కొత్తపల్లి నగేష్ మాట్లాడుతూ.. ”ఫ్యామిలీ ఎంటర్టైనర్గా సాగే ఈ చిత్రంలో మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది. ఒకరకంగా ఇది మ్యూజికల్ చిత్రం అని చెప్పొచ్చు. ఈ నెల 21వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనున్నాం. ఈ చిత్రంలో ఇద్దరు హీరోలు, ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. అయితే ఒక హీరోయిన్ గా కృష్ణప్రియ ఖరారు కాగా మరో హీరోయిన్ ను ఎంపిక చేయాల్సి ఉంది” అని చెప్పారు. ఈ చిత్రానికి నందన్ రాజు బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.
Also Read
- TFTDDA Dispute: డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదంలో కీలక మలుపు.. సెప్టెంబర్ 13 సమావేశంపై కోర్టు స్టే!
- Toxic Loss: యష్ ‘టాక్సిక్’కు రూ.300 కోట్ల నష్టం.. ఇంగ్లీష్ వెర్షన్ వసూళ్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే!
- Vinayaka Chavithi: వెండితెరపై విఘ్నేశ్వరుడి వైభవం.. ఈ సినిమాలు చూస్తే వినాయకుడి కథ కళ్లముందే కదలాడుతుంది!
- Tollywood : సినిమాలలో అవకాశాల పేరుతో మోసం చేశారంటూ డిస్ట్రిబ్యూటర్ ఇంటి ముందు బాధితుల ధర్నా.
తాజావార్తలు
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
TFTDDA Dispute: డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదంలో కీలక మలుపు.. సెప్టెంబర్ 13 సమావేశంపై కోర్టు స్టే!
-
Explainer: సిక్కులపై అమెరికా పగ పట్టిందా?
-
Xi Jinping: భారత్‌లో అడుగు పెట్టిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్.. మోడీతో భేటీపై అందరి చూపు..
-
MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
ట్రెండింగ్
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..