Site icon NTV Telugu

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ సంచలన ప్రకటన.. మళ్లీ జబర్దస్‌కు రాబోతున్నా..!!

Sudigaali Sudheer

Sudigaali Sudheer

Sudigali Sudheer: ప్రముఖ నటుడు సుడిగాలి సుధీర్ సంచలన ప్రకటన చేశాడు. తాను మళ్లీ జబర్దస్త్ ప్రోగ్రాంకు వస్తున్నట్లు ప్రకటించాడు. తాజాగా అతడు నటించిన ‘గాలోడు’ సినిమా ప్రమోషన్‌లను చిత్ర యూనిట్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా జబర్దస్త్, మల్లెమాల సంస్థను ఎందుకు వదలాల్సి వచ్చిందో సుడిగాలి సుధీర్ వివరించాడు. జబర్దస్త్ నుంచి బయటకు రావడం తనకు తానుగా తీసుకున్న నిర్ణయమే అని.. కొన్ని అవసరాలు ఉండటం వల్ల ఆరు నెలలు గ్యాప్ కావాలని మల్లెమాల వాళ్లకు చెబితే వారు అంగీకరించారని సుధీర్ చెప్పాడు. అయితే ఇప్పుడు మళ్లీ షోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పడంతో మల్లెమాల వాళ్లు ఒప్పుకున్నారని తెలిపాడు.

Read Also: Love Signs: మీరు ప్రేమలో పడ్డారని తెలిపే సంకేతాలు ఇవే..!!

కాగా గాలోడు చిత్రంలో తన పాత్ర కొత్తగా ఉంటుందని.. నిజంగా గాలోడిలాగానే అనిపిస్తుందని సుడిగాలి సుధీర్ చెప్పాడు. అందుకే ఈ సినిమాకు గాలోడు అనే టైటిల్ ఖరారు చేశామన్నాడు. ఈ సినిమాలో మాస్ కమర్షియల్ అంశాలన్నీ ఉంటాయని.. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు తాను ఈ సినిమా చేశానని తెలిపాడు. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్‌కు ప్రశంసలు లభించాయని.. తాను హీరోగా ఓ మంచి సినిమా చేశానని కొందరు మెచ్చుకున్నారని సుడిగాలి సుధీర్ వెల్లడించాడు. ఈ సినిమాలో తొలుత హీరోయిన్‌గా రష్మీని తీసుకుందామని భావించామని.. కానీ డేట్లు కుదర్లేదని చెప్పాడు. తనకు హీరోగా కంటే ఎంటర్‌టైనర్‌గా పిలిపించుకోవడంలోనే సంతోషం ఉంటుందని సుధీర్ అన్నాడు.

Exit mobile version