Site icon NTV Telugu

Sudigali Sudheer: బీచ్ లో ‘గాలోడు’.. రష్మీనే ఫోటో తీసింది.. ?

Sudheer

Sudheer

Sudigali Sudheer: జబర్దస్త్ షో ద్వారా పరిచయమైన నటుడు సుడిగాలి సుధీర్. జబర్దస్త్ లో కంటెస్టెంట్ గా మొదలైన సుధీర్ కెరీర్ టీమ్ లీడర్ గా, యాంకర్ గా, కమెడియన్ గా, హీరో అయ్యేవరకు కొనసాగింది. గాలోడు సినిమాతో సుధీర్ హీరోగా మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా తరువాత లక్కీ మీడియా, మహాతేజా క్రియేషన్స్ బ్యానర్స్ లో గోట్ అనే సినిమా చేస్తున్నాడు. నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కోలీవుడ్ భామ దివ్యభారతి నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్దమవుతుంది. ఇక వరుస సినిమాలు ఓకే కావడంతో సుధీర్ షోలు తగ్గించేసాడు. ఇక తాజాగా సుధీర్ వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తున్నాడు.

Anirudh Ravichandran: సింగర్ జోనితాతో అనిరుధ్ ఎఫైర్.. ?

బీచ్ ఒడ్డున సన్ సెట్ సమయంలో ఒంటరిగా నిలబడిన ఫోటోను షేర్ చేస్తూ బీచెస్ అండ్ సన్ సెట్స్ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ ఫోటోలో సుధీర్ చాలా స్టైలిష్ గా కనిపించాడు. అయితే ముఖంపై షాడో పడినా కూడా గుబురు గడ్డం, బ్లాక్ టీ షర్ట్ పై షార్ట్, గాగుల్స్ , వెనుక ట్రావెల్ బ్యాగ్ తో కనిపించాడు. ఇక ఈ ఫోటో చూసిన అభిమానులందరూ సూపర్ .. సూపర్ అంటుండగా.. మరికొందరు.. అదేంటి సుధీర్ బీచ్ లో ఒక్కడివే ఉన్నావ్.. రష్మీ రాలేదా అని అడుగుతుండగా.. మిగతా వారు ఆ ఫోటో తీసింది రష్మీనే కదా అంటూ జోక్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక సుధీర్, రష్మీ మధ్య కేవలం స్నేహ బంధం మాత్రమే ఉందని, త్వరలోనే సుధీర్ మరో అమ్మాయిని పెళ్లాడనున్నాడని తెలుస్తోంది. దీంతో వారిద్దరి అభిమానులు నిరాశ చెందుతున్నారు.

Exit mobile version