Sudigali Sudheer: జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన నటుడు సుడిగాలి సుధీర్. ఒక మెజీషియన్ గా కెరీర్ ను ప్రారంభించి.. ఎన్నో అవమానాలు పడి, జబర్దస్త్ లో చోటు సంపాదించుకొని.. కంటెస్టెంట్ నుంచి టీమ్ లీడర్ గా, యాంకర్ గా.. కమెడియన్ గా.. హీరోగా సుధీర మారిన తీరు ఎంతోమందికి ఆదర్శదాయకమని చెప్పాలి. ఇక గాలోడు సినిమాతో హిట్ అందుకున్న సుధీర్ ప్రస్తుతం గోట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సుధీర్ సరసన బ్యాచిలర్ భామ దివ్య భారతి నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ లో సుధీర్ హీరో ఎలివేషన్ వేరే లెవెల్ లో ఉంది అంటే అతిశయోక్తి కాదు. ఈ మధ్యకాలంలో ట్విట్టర్ లో GOAT అని బాగా పాపులర్ అయిన విషయం తెల్సిందే. GOAT అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. తమకు నచ్చిన హీరోలు, సెలబ్రిటీలను ఫ్యాన్స్ గోట్ అని పిలుస్తారు. ఇక సుధీర్ కూడా గోట్ అని చెప్పుకుంటున్నాడు.
Posani Krishna Murali: నేను చస్తే.. నా శవాన్ని కూడా వారికి చూపించొద్దు
ఇక గ్లింప్స్ లో.. టెన్నిస్ లో గోట్ అయిన రోజర్ ఫెదరర్ ను.. క్రికెట్ లో గోట్ అయిన విరాట్ కోహ్లీని, సినిమాల్లో గోట్ అయిన రాజమౌళని చూపిస్తూ GOA ను ఫీల్ చేసిన మేకర్స్ T లో సుధీర్ ను యాడ్ చేశారు. ఇక సుధీర్ లుంగీ కట్టుకొని.. సిగరెట్ కాలుస్తూ క్రికెట్ బ్యాట్ పట్టుకొని.. ఎవడ్రా నన్ను ఫ్లూక్ అంది అని అనగానే.. వెనుక నుంచి మూడు కార్లు రావడం హైలైట్ గా నిలిచింది. ఇక లియోన్ జేమ్స్ అందించిన సంగీతం వేరే లెవెల్ అని చెప్పొచ్చు. మొత్తానికి హీరో ఎలివేషన్ సుధీర్ కు బాగా సెట్ అయ్యిందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ గ్లింప్స్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో సుధీర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.