NTV Telugu Site icon

Sudigali Sudheer: మళ్ళీ జబర్దస్త్ లోకి సుడిగాలి సుధీర్.. గుడ్ న్యూస్ చేప్పేశాడు

Sudigali Sudheer

Sudigali Sudheer

Sudigali Sudheer about Re Entry in Jabardasth: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న వారిలో సుడిగాలి సుధీర్ కూడా ఒకరు. ఒకప్పుడు మెజీషియన్ గా స్టేజ్ షోలు చేసుకునే సుధీర్ కి జబర్దస్త్ లో వచ్చిన అవకాశం కెరీర్ మొత్తాన్ని మార్చేసింది. సుడిగాలి సుధీర్ గా మారి కొన్నాళ్లపాటు ఒక టీంని కూడా మెయింటైన్ చేశాడు. అయితే ఈ మధ్యకాలంలో ఆయన జబర్దస్త్ నుంచే కాదు పూర్తిగా మల్లెమాల కార్యక్రమాల నుంచి కూడా తప్పుకోవడంతో ఆయన ఇక మల్లెమాల కార్యక్రమాలలో కనిపించకపోవచ్చునే ప్రచారం జరిగింది. కానీ తాజా ఇంటర్వ్యూలో అసలు విషయం బయట పెట్టాడు సుధీర్. తాను జబర్దస్త్ కి దూరం కాలేదని కేవలం షార్ట్ బ్రేక్ మాత్రమే తీసుకున్నానని చెప్పుకొచ్చారు. తాను ముందే మల్లెమాల సంస్థ యాజమాన్యంతో మాట్లాడానని తనకు కొన్ని ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉండడంతో అవి తీర్చగలరా అని అడిగితే తాము వేరే చోట్ల పెట్టుబడులు పెట్టాము కాబట్టి ఇప్పుడేమీ చేయలేము అని అన్నారని దీంతో తనకు ఆరు నెలల బ్రేక్ ఇవ్వమని అడిగితే అందుకు వారు సంతోషంగా ఇచ్చారని చెప్పకొచ్చాడు.

Mannara chopra: మీడియా ముందే హీరోయిన్ కి ముద్దు పెట్టిన డైరెక్టర్

ఆరు నెలలు బ్రేక్ తీసుకుని ఆ బ్రేక్ పూర్తయిన నేపద్యంలో ఈ మధ్యనే వెళ్లి వారిని కలిశానని తన ఇబ్బందులు తీరిపోయాయి ఇక ఎప్పుడు వచ్చి ప్రోగ్రాం చేయమన్నా చేస్తానని చెప్పానని దానికి వాళ్ళు సంతోషంగా ఒప్పుకున్నారని చెప్పుకొచ్చాడు. అయితే ఈ విషయం గురించి తాను ఎప్పుడూ మాట్లాడలేదు కాబట్టి జబర్దస్త్ కి మల్లెమాల సంస్థకి గుడ్ బై చెప్పి వెళ్ళిపోయానని అందరూ అనుకుంటున్నారు, కానీ అసలు నిజం అది కాదని చెప్పుకొచ్చాడు. ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ఛానల్ ఏది అనేది ముఖ్యం కాదు తనకు యూట్యూబ్ ఛానల్ లో అవకాశం వచ్చినా జనాన్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటానని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు సుధీర్.