Sudigali Sudheer: బుల్లితెర ప్రేమ జంట సుధీర్- రష్మీ గురించి ప్రత్యేకంగా పరిచయ వాక్యాలు అవసరం లేదు. టాలీవుడ్ లో ఏది ఫేమస్ అయినా కాకపోయినా.. బుల్లితెరపై మాత్రం వీరిద్దరి ప్రేమాయణం మాత్రం ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంది. వీరిద్దరూ కలసిన వెంటనే పెళ్లెప్పుడు అని అడిగే కెమెరాలు.. మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని చెప్పే అభిమానులు తప్ప ఇంకేమి కనిపించదు. జబర్దస్త్ ద్వారా వీరి పరిచయం జరిగింది. సుడిగాలి సుధీర్ గా ఒక బ్రాండ్ ను సంపాదించుకున్న సుధీర్ ప్రస్తుతం హీరోగా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇంకోపక్క రష్మీ సైతం షోస్ చేస్తూనే కొన్ని కొన్ని సినిమాల్లో ముఖ్య పాత్రలు చేస్తూ బిజీగా మారింది. ఇక ఈ జంట కొన్ని రోజుల నుంచి షోలో కనిపించడం చాలా తక్కువగా మారింది. కాగా, చాలా రోజుల తర్వాత ఒక షోలో వీరిద్దరూ కలిసి పాల్గొన్నారు. దీంతో సుధీర్- రష్మీ ఫ్యాన్స్ అసెంబుల్ అయ్యారు. చాలా రోజుల తర్వాత వీరిద్దరూ కలిసి డాన్స్ పెర్ఫార్మన్స్ చేయడంతో అభిమానులు ఎంతగానో సంతోషించారు. పెళ్లెప్పుడు..? పెళ్లెప్పుడు..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Meenakshi Chaudhary: గురూజీ టేస్ట్ ఉంటుంది రా.. చారి.. వేరే లెవెల్ అంతే
ఇక ఈ షోలో సుధీర్, రష్మీ గురించి మాట్లాడుతూ “రష్మీతో నాది బ్యూటిఫుల్ జర్నీ.. ఆమె చాలా సెన్సిటివ్, చాలా కష్టపడే తత్వం ఉన్న వ్యక్తి, నాకు అందరికంటే రష్మీ చాలా ఎక్కువ. మేము ఎప్పుడు బయట కనిపించినా కూడా అందరూ మా ఇద్దరి గురించే అడుగుతూ ఉంటారు. చెప్పాలంటే.. నా జర్నీలో, నా సక్సెస్ లో ఆమెదే మెయిన్ రోల్. కెరీర్ లో నేను ముందుకెళ్లడానికి ఆమెతో చేసిన స్కిట్స్ ఎంతో ఉపయోగపడ్డాయి. మేమిద్దరం కలిసి చేసిన ప్రోగ్రామ్స్, ఈవెంట్స్ అన్నీ సక్సెస్ అయ్యాయి. ఇవన్నీ నాతో కలిసి చేసినందుకు రష్మీకి థాంక్స్” అని చెప్తూనే చివర్లో మిస్ యు రష్మీ అని చెప్పి ఎమోషనల్ అయ్యాడు. ప్రస్తుతం ఎందుకు సంబంధించిన వీడియో మారింది.