Sudigali Sudheer: జబర్దస్త్ ఒక సాధారణ కంటెస్టెంట్ గా అడుగుపెట్టి, తన మ్యాజిక్ తో, పంచ్ లతో నవ్వించి టీమ్ లీడర్ గా ఎదిగి.. స్టార్ స్టేటస్ ను అందుకొని ప్రస్తుతం హీరోగా మారాడు సుడిగాలి సుధీర్. అభిమానులకు సుధీర్ అంటే ఎంతో ఇష్టం. అతని పంచ్ లు, ప్రాసలు, డ్యాన్స్ అన్నింటికి మించి అతని వ్యక్తిత్వానికి అభిమానులు ఫిదా అయిపోయారు. ప్రస్తుతం నటుడుగా, యాంకర్ గా బిజీగా ఉన్న సుధీర్ తాజాగా తన స్ట్రగుల్స్ గురించి చెప్పుకొచ్చాడు. తనను ఇక్కడి వరకు ఎవరు తీసుకొచ్చారు అని చెప్పి అందరికి షాక్ ఇచ్చాడు. టిల్లు వేణు దర్శకత్వం వహిస్తున్న బలగం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న సుధీర్ మాట్లాడుతూ.. తాను ఇప్పుడు ఈ స్టేజి మీద ఉన్నాను అంటే అందుకు కారణం వేణునే అని చెప్పుకొచ్చాడు.
Pawan Kalyan: అకీరాతో క్రికెట్ ఆడిస్తున్న పవర్ స్టార్.. ఫోటో వైరల్
“నేను ఈరోజు ఇక్కడ ఉండి ఇలా మాట్లాడుతున్నాను అంటే అందుకు కారణం వేణు అన్ననే. ఆయనే లేకపోతే ఈరోజు నేను ఎక్కడో ఉండేవాడిని. వేణు అన్న వలనే.. నా కుటుంబం మూడు పూటలా తినగలుగుతున్నాం. నాకు జబర్దస్త్ లో ఛాన్స్ ఇచ్చి నన్ను నమ్మి తన టీమ్ లోకి తీసుకున్నాడు. అందుకు వేణు అన్నకు జీవితాంతం రుణపడి ఉంటాను. ఇప్పటివరకు మీ అందరికి వేణు అన్న ఒక కమెడియన్ గానే తెలుసు.. ఇప్పుడు దర్శకుడిగా మారుతున్నాడు. ఆయన దగ్గర ఈ ట్యాలెంట్ ఉందని గుర్తించి ఆయనకు సపోర్ట్ చేసిన దిల్ రాజు గారికి ధన్యవాదాలు. ఇక్కడ కూడా వేణు అన్న విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా చూసాకా ఒక్కసారైనా మీ తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడాలనిపిస్తోంది. తల్లిదండ్రులు పోయాక బాధపడడం కన్నా.. బతికి ఉన్నప్పుడే వారిని సంతోషంగా చూసుకోవాలి అనే కథతో బాలగం తెరకెక్కింది. కుటుంబం మొత్తంతో కలిసి చూడండి.. మీ అందరికి బాగా నచ్చుతోంది” అంటూ చెప్పుకొచ్చాడు.