సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘జటాధర’. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ పై ప్రేరణ అరోరాతో జీ స్టూడియోస్ మరియు సుధీర్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న ఈ మూవీకి వెంకట్ కళ్యాణ్ మరియు అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలివుడ్ స్టార్ కిడ్ సోనాక్షి సిన్హా హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ ఆన్ లైన్ లో జటాధర టీజర్ ను రిలీజ్ చేసారు.
శివుని జటల నుండి ప్రళయం ఉద్భవించినపుడు, అధర్మానికి అంతం ఖాయం వంటి డైలాగ్స్ బాగున్నాయి. జటాధర సినిమా కథ అనంత పద్మనాభ స్వామి ఆలయం చుట్టూ తిరుగుతుంది. అక్కడి సంపద, దాని చుట్టూ అల్లుకున్న వివాదాలు, నేపథ్యం, చరిత్ర ఇలా అనేక అంశాలు, అక్కడి నిధిని మాత్రమే కాకుండా ఆలయ చరిత్ర, పురాణా కథల్ని కూడా చూపించబోతోన్నారు. ఈ సినిమాలో సుధీర్ బాబు కారెక్టర్ చాలా భిన్నంగా ఉండబోతోంది. తాజాగా రిలీజ్ అయిన టీజర్ చూస్తే అర్ధం అవుతోంది. ఆ ; అలాగే సోనాక్షి సిన్హా పాత్ర చుట్టూ ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఉమేష్ కెఆర్ బన్సాల్, ప్రేరణ అరోరా, శివిన్ నారంగ్, రాజీవ్ అగర్వాల్, అరవింద్ అగర్వాల్, నిఖిల్ నందా, మోనేష్ మంఘ్నానితో పాటు జీ స్టూడియోస్ బ్రాండ్ వ్యాల్యూ పెంచేలా ఈ జటాధర ఉండబోతోంది. బ్యాక్ టు బ్యాక్ ప్లాపులలో ఉన్న సుధీర్ బాబు ఈ సినిమాతో సూపర్ హిట్ కొడతాడని ధీమా వ్యక్తం చేస్తోంది యూనిట్.