సుధీర్ బాబు హీరోగా ప్రేరణ అరోరాతో కలిసి జీ స్టూడియోస్ నిర్మిస్తున్న చిత్రం ‘జటాధర’. సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న ఈ మూవీకి వెంకట్ కళ్యాణ్ తో పాటు అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహిస్తున్నారు. అనంత పద్మనాభ స్వామి ఆలయం అక్కడి సంపద, దాని చుట్టూ అల్లుకున్న వివాదాలు, నేపథ్యం, చరిత్ర ఇలా అనేక అంశాలను ఈ చిత్రంలో చూపించనున్నారు. అక్కడి నిధిని మాత్రమే కాకుండా ఆలయ చరిత్ర, పురాణా కథల్ని కూడా చూపించబోతోన్నారు. ఈ సినిమాలో సుధీర్ బాబు కారెక్టర్ చాలా భిన్నంగా ఉండబోతుందని యూనిట్ చెప్తూ వస్తుంది.
Also Read : KantaraChapter1 : కాంతార చాప్టర్ -1 స్టోరీ ఇదే.. ఇండస్ట్రీ హిట్ లోడింగ్
ఈ సినిమాతో సోనాక్షి సిన్హా టాలీవుడ్ లో అడుగుపెట్టబోతుంది. ఆ మధ్య రిలీజ్ చేసిన జటధరా గ్లిమ్స్ మంచి రెస్సాన్స్ దక్కించుకుంది. కాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసారు మేకర్స్. ఈ ఏడాది నవంబరు 7న జటాధరా వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నట్టు వెల్లడించారు. అందుకు సంబంధించి పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. తెలుగు మరియు హిందీలో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. హిందీలో సుధీర్ బాబు వర్షం రీమేక్ బాఘీలో విలన్ రోల్ పోషించాడు. మరోవైపు వరుస సినిమాలు చేస్తున్న సుధీర్ బాబు హిట్ కోసం తెగ కష్టపడుతున్నాడు. కానీ అనుకున్న రేంజ్ హిట్ మాత్రం రావట్లేదు. హరోం హరతో ఓకే అనిపించుకున్న సుధీర్, మా నాన్న సూపర్ హీరో హీరోతో ప్లాప్ కొట్టాడు. ఇప్పుడు రాబోతున్న జటాధరతో సోనాక్షి అదనపు ఆకర్షణగా ప్రజెంట్ ట్రెండ్ కు తగ్గట్టు మైథలాజికల్ కథ నేపధ్యంతో రాబోతున్న సుధీత్ బాబు హిట్టు కొడతానని ధీమాగా ఉన్నారు.
