Sudheer Babu : గన్స్ డోంట్ లై… ‘సుధీర్16’ లాంచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ స్టార్ సుధీర్ బాబు త్వరలో మరో మాస్ ఎంటర్‌టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ‘కథలో రాజకుమారి’ ఫేమ్ దర్శకుడు మహేష్ సూరపనేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ ను తాత్కాలికంగా “సుధీర్ 16” పేరుతో పిలుచుకుంటున్నారు. నిన్న ఈ సినిమా లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. సోషల్ మీడియా ద్వారా సుధీర్ బాబు ఈ విషయాన్ని అభిమానులకు తెలియజేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో సుధీర్ బాబు “ఇది ప్రారంభమైంది… ఈ అద్భుతమైన టీమ్‌తో కలిసి పని చేయడానికి ఎదురు చూస్తున్నాను!! #Sudheer16 సెట్స్‌పైకి వెళ్లడానికి ఆతృతగా ఉన్నాము! టార్గెట్ సెట్!!” అంటూ సినిమా లాంచ్ ఫోటోలను పంచుకున్నాడు. అంతకుముందు సుధీర్ బాబు తన అభిమానులకు ఆసక్తిని రేకెత్తించే పోస్టర్‌తో ఈ సినిమాను ప్రకటించాడు. పోస్టర్‌లో అసాల్ట్ రైఫిల్స్, మెషిన్ గన్‌లు పద్దతిగా అమర్చి, పోలీస్ స్టేషన్‌లోని పకడ్బందీ విభాగంలో వాటిని ఉంచారు. ఈ సినిమాలో సుధీర్ బాబు పోలీసు పాత్రలో కనిపిస్తాడు. మిగతా వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. ఈ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ లో శ్రీకాంత్‌తో పాటు ‘ప్రేమిస్తే’ ఫేమ్ భరత్ కీలక పాత్రలో కన్పించనుండగా, ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై వి ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. మార్చి 14 నుంచి షూటింగ్ ప్రారంభమవుతుంది.
Read Also : SVP Song Leaked : పనిస్తే ఇలాంటి పని… వాడికి తెలియాలంటూ తమన్ ఎమోషనల్
Also Read
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
- Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
- Adarsha Kutumbam: 'ఆదర్శ కుటుంబం'.. ఆ రూమర్లు నిజమేనా?
- RC17 : రామ్ చరణ్ - సుకుమార్ సినిమా షూటింగ్, రిలీజ్‌కు పక్కా ప్లాన్
ఇక మరోవైపు సుధీర్ బాబు కృతి శెట్టితో కలిసి నటించిన రొమాంటిక్ కామెడీ “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” విడుదలకు సిద్ధంగా ఉంది. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం వారిద్దరి కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ మూవీ. ఇంతకుముందు వీరిద్దరూ కలిసి సమ్మోహనం, వి వంటి హిట్ చిత్రాలను అందించారు. మైత్రీ మూవీ మేకర్స్, బెంచ్‌మార్క్ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజున వెండితెరపైకి రానుంది.
తాజావార్తలు
-
Mission Shakti: భారత్ ‘‘శాటిలైట్’’ను పేల్చేయడంతో అమెరికా షాక్.. యూఎస్ ఇంటెలిజెన్స్‌లో కలకలం!
-
రూ.2,254 నుంచి రూ.984! ఒక్క దెబ్బతో 5 ఏళ్ల లాభాలు స్వాహా.. PB ఫిన్‌టెక్‌ను ముంచేసిందెవరు?
-
High Court: కొడుకు తప్పు చేస్తే తండ్రికి సంబంధం ఏంటి? హైకోర్టు కీలక తీర్పు
-
Auto Fare Hike: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ఇక మీటర్ లెక్క ఇదే.!
-
BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!