NTV Telugu Site icon

Sudha Kongara: చిక్కులో సూర్య డైరెక్టర్.. క్షమాపణ చెప్పి తీరాల్సిందే

Sudha

Sudha

Sudha Kongara: గురు, ఆకాశం నీ హద్దురా సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయింది సుధా కొంగర. ఈ సినిమా తరువాత ఆమె రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ప్రస్తుతం సూర్యతో కలిసి మరో సినిమా చేస్తోంది. ఇక ఇప్పటివరకు ఎటువంటి వివాదాల జోలికి పోనీ సుధా.. తాజాగా ఒక వివాదంలో చిక్కుకుంది. అయితే.. అదేదో ఇప్పుడు జరిగింది కూడా కాదు. ఎన్నో ఏళ్ల క్రితం సుధా అన్న కొన్ని వ్యాఖ్యలు.. ఇప్పుడు వివాదాన్ని తీసుకొచ్చి పెట్టాయి. అసలు విషయం ఏంటంటే.. నిర్మాత జ్ఞానవేల్ రాజా కు డైరెక్టర్ అమీర్ కు మధ్య ఎప్పటినుంచో వివాదం నడుస్తోంది. ఒక సినిమా విషయంలో జ్ఞానవేల్ రాజా తనకు అన్యాయం చేశాడని అమీర్ ఆరోపించాడు. ఈ వివాదం గురించి గత కొన్నిరోజులుగా చర్చలు నడుస్తున్న విషయం తెల్సిందే. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో జ్ఞానవేల్ రాజా.. గతంలో సుధా కొంగర, అమీర్ తీసిన సినిమా గురించి మాట్లాడిన మాటలను బయటపెట్టాడు. పరుత్తివీరన్ కన్నా ముందు అమీర్.. జీవా హీరోగా రామ్ అనే సినిమా తీశాడు. ఆ సినిమా చూసిన సుధా.. మేకింగ్ సరిగ్గా లేదని, సినిమా అస్సలు బాగోలేదని సగంలోనే థియేటర్ నుంచి బయటకు వచ్చినట్లు చెప్పాడు. ఇక ఆ వ్యాఖ్యలకు అమీర్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. సుధా కొంగరపై ఫైర్ అవుతున్నారు. ఇక ఈ చర్చకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది సుధా కొంగర.

Suriya : మమ్ముట్టి సినిమాపై ప్రశంసలు కురిపించిన సూర్య..

ట్విట్టర్ వేదికగా ఆమె మాట్లాడుతూ.. “ఫిబ్రవరి 2, 2016. నాకు అమీర్ అన్న నుండి కాల్ వచ్చింది .నేను ప్రసాద్ స్టూడియోస్ బయట డ్రైవింగ్ చేస్తున్నాను. ఇరుధి సుట్రు విజయం తరువాత పరిశ్రమ నుంచి నన్ను ప్రశంసించిన మొదటి వ్యక్తి కాబట్టి ఆ క్షణం నాకు ఇప్పటికీ గుర్తు ఉంది.. నేను అతనితో ఒక విషయం చెప్పాను, నా మది పాత్రకు పరుత్తివీరన్ లోని హీరోయిన్ పాత్ర నుండి ప్రేరణ పొందింది. నేను ఒక పురుషుడు వ్రాసిన గొప్ప స్త్రీ పాత్రలలో ఒకదానిని గురించి కొనసాగించాను. మధి పాత్రలో నటించిన నటీమణులు మరియు ఆ తర్వాత బొమ్మి పాత్రలో నటించిన నటీమణులు ఇద్దరినీ నేను పరుత్తివీరన్‌ని రిఫరెన్స్‌గా చూసాను. మరియు ఇది తమిళ సినిమా యొక్క మాస్టర్ ఫిల్మ్ మేకర్‌కి నా నివాళి. నేను చెప్పేది ఒక్కటే” అని చెప్పుకొచ్చింది. ఇక ఈ ట్వీట్ చూసిన అభిమానులు.. ఇవన్నీ కాదు.. అమీర్ కు క్షమాపణ చెప్పి తీరాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. మరి ఇప్పుడు ఈ వివాదం ఎక్కడివరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.