Suchitra Krishnamoorthi: ఇష్టంతో పెళ్లి చేసుకుంటే.. మోసం చేసి వెళ్లిపోయాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suchitra Krishnamoorthi Says Shekhar Kapoor Cheated On Her: సాధారణంగా సినీ తారలు తమ వ్యక్తిగత జీవితాల్ని పంచుకోవడానికి పెద్దగా ఇష్టపడరు. మంచైనా, చెడైనా.. వాటిని రహస్యంగానే ఉంచుతారు. కానీ.. కొందరు మాత్రం ఆ విషయాల్ని బయటపెట్టేస్తుంటారు. ముఖ్యంగా.. చేదు అనుభవాలు చవిచూసిన తారలు, మనసులో ఆ బాధని దిగమింగుకోలేక ఏదో ఒక సమయంలో వాటిని మీడియాతో పంచుకుంటారు. ఇప్పుడు సింగర్, నటి సుచిత్రా కృష్ణమూర్తి కూడా తన పర్సనల్ విషయాల గురించి చెప్పుకొచ్చారు. ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్‌తో ప్రేమ, పెళ్లి, విడాకుల విశేషాల్ని రివీల్ చేశారు. 1999లో ప్రేమించి పెళ్లి చేసుకున్న వీళ్లిద్దరు.. కొన్ని కారణాల వల్ల 2007లో విడిపోయారు. ఇప్పుడు ఆ కారణాలేంటో సుచిత్ర వెల్లడించారు. తన మాజీ భర్తలో నిజాయితీ లేదని, ప్రేమించి పెళ్లి చేసుకున్న తనని మోసం చేసి వెళ్లిపోయాడని.. గతాన్ని గుర్తు చేసుకున్నారు.
NTR 31: నీల్-ఎన్టీఆర్ సినిమాకి బ్రేక్ వేస్తున్న సలార్?
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
సుచిత్ర మాట్లాడుతూ.. తనకు సినీ పరిశ్రమలో ఎవరూ తెలియకపోయినా, ఇష్టంతో సినిమాల్లోకి వచ్చానని చెప్పారు. అప్పట్లో సినీ పరిశ్రమపై తన తల్లిదండ్రులకు సదుద్దేశం లేకపోవడంతో, తాను అబద్ధం చెప్పి కొచ్చి వెళ్లానని, అక్కడ సినిమాల్లో పని చేశానని అన్నారు. తాను నటించిన చాలా సినిమాలు సూపర్‌హిట్స్ అవ్వడంతో తనకు మంచి గుర్తింపు వచ్చిందన్నారు. అదే సమయంలో తనకు శేఖర్‌తో పరిచయం ఏర్పడిందన్నారు. తనకు 10-12 ఏళ్ల వయసున్నప్పుడు.. తాను పెళ్లంటూ చేసుకుంటే ఇమ్రాన్ ఖాన్ (పాక్ మాజీ క్రికెటర్, మాజీ ప్రధాని) లేదా శేఖర్ కపూర్‌నే పెళ్లి చేసుకోవాలని అనుకునేదాన్నని చెప్పారు. అంతలా శేఖర్‌ని తాను ఇష్టపడేదాన్నని, ఎట్టకేలకు తాను ప్రేమించిన వ్యక్తితోనే పెళ్లి చేసుకున్నానని పేర్కొన్నారు. ‘నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే, జీవితంలో మళ్లీ నీకు కనిపించను’ అని బెదిరించి మరీ.. తానే శేఖర్‌ని పెళ్లి చేసుకున్నానని వివరించారు. అతడ్ని పెళ్లి చేసుకోవద్దని తల్లి తనకు పదేపదే చెప్పేదని, అయినా వినకుండా ఆయన మీదున్న ప్రేమతో పెళ్లి చేసుకున్నానని తెలిపారు.
Fake Kidnap: ఫిల్మ్ నగర్ పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించిన యువకుడు
పెళ్లయ్యాక శేఖర్ తనని సినిమాల్లో నటించొద్దని కండీషన్ పెట్టాడని.. తనకు ఆ సమయంలో మంచి క్రేజ్ ఉన్నప్పటికీ, భర్త మాటకు విలువిచ్చి సినిమా అవకాశాల్ని వదులుకున్నానని సుచిత్ర పేర్కొన్నారు. అయితే.. పెళ్లైన కొన్నాళ్లకే శేఖర్ తనని మోసం చేశాడని అన్నారు. తనకు పాప పుట్టిన తర్వాత, కొన్ని సంవత్సరాల వరకు వేచి చూశానన్నారు. ఇక చివరికి జీవితంలో ముందుకు సాగాలని నిర్ణయించుకుని, శేఖర్ ఎపిసోడ్‌ని తన జీవితంలో నుంచి తొలగించేశానని చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?