Site icon NTV Telugu

Suchitra Krishnamoorthi: ఈ రాత్రికి నాతో పడుకో.. తెల్లారి ఇంటిదగ్గర దింపుతా అన్నాడు

Suchitra

Suchitra

Suchitra Krishnamoorthi:ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొని నటీమణులు ఉన్నారా.. ? అంటే లేరనే మాటనే వినిపిస్తుంది. ఒక్క హీరోయిన్ అనే కాదు.. సింగర్స్, డ్యాన్సర్లు, కాస్ట్యూమ్ డిజైనర్లతో సహా ప్రతి ఒక్కరు ఏదో ఒకచోట క్యాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కున్నవారే. అయితే ఒకప్పుడు తాము క్యాస్టింగ్ కౌచ్ గురించి బయటకు చెప్పడానికి భయపడేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. సోషల్ మీడియా వచ్చాకా.. ప్రతి ఒక్కరు.. తాము ఎదుర్కుంటున్న వేధింపులను నిర్మొహమాటంగా బట్టబయలు చేస్తున్నారు. తాజాగా.. ప్రముఖ సింగర్, నటి సుచిత్రా కృష్ణమూర్తి తన జీవితంలో జరిగిన ఒక చేదు సంఘటనను చెప్పుకొచ్చింది. కెరీర్ మొదట్లో సింగింగ్ ఆడిషన్ కు వెళ్లినప్పుడు ఒక డైరెక్టర్ తనను డైరెక్ట్ గా పడుకో అని అడిగినట్లు ఆమె చెప్పుకొచ్చింది. ఆ సమయంలో తనకు కాళ్ళు, చేతులు ఆడలేదని, భయంతో వణికిపోయినట్లు ఆమె తెలిపింది.

Baby: అలా అయితే… ‘బేబీ’ ఓ సెన్సేషన్!

” అప్పట్లో సింగింగ్ ఆడిషన్స్ అన్ని హోటల్స్ లో జరిగాయి. ఒక ఆడిషన్ కోసం ఒక డైరెక్టర్ నన్ను ఒక హోటల్ కు రమ్మని చెప్పాడు. అప్పుడు సమయం 5 గంటలు అవుతుంది. ఇక ఆడిషన్ అయ్యాక.. నీకు మీ అమ్మతో ఎక్కువ చనువుగా ఉంటావా.. ? నాన్నతో ఎక్కువ చనువుగా ఉంటావా.. ? అని అడిగాడు. నేను వెంటనే మా నాన్నతోనే ఎక్కువ చనువుగా ఉంటానని చెప్పాను. దీంతో మీ నాన్నకు ఫోన్ చేసి.. డైరెక్టర్ గారు.. నన్ను రేపు ఇంటి దగ్గర దింపుతారు అని చెప్పు అన్నాడు. అసలు ఆయన ఏం అంటున్నాడో నాకు అర్ధం కాలేదు. 5 గంటల నుంచి ఉదయం వరకు ఈయనతో పాటు ఉండి నేను ఏం చేయాలి అనుకున్నాను. అయితే కొద్దిసేపటికి ఆయన.. నన్ను రాత్రి పడుకోమనడానికి అడిగాడు అని అర్థమై వణుకు పుట్టింది. వెంటనే అక్కడ నుంచి చెప్పాపెట్టకుండా వచ్చేసాను. ఇది నా కెరీర్ లో చాలాసార్లు జరిగింది. మిగతా వారితో పోలిస్తే నాకు జరిగింది చాలా చిన్నదే.. కానీ, అది నాకు కలిగించిన భయం అంతా ఇంతా కాదు” అని సుచిత్ర చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ వ్యాఖ్యలు విన్న సుచిత్ర అభిమానులు ఆ డైరెక్టర్ ఎవరా.. ? అని ఆరాలు తీస్తున్నారు.

Exit mobile version