Baby: అలా అయితే… ‘బేబీ’ ఓ సెన్సేషన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొద్ది రోజులుగా ఎక్కడ విన్నా లూప్ మోడ్‌లో వినిపిస్తున్న ఒకే ఒక సాంగ్ ‘ఓ రెండు ప్రేమ మేఘాలిలా… దూకాయి వానలాగా’… ఈ ఒక్క పాట తెలుగు ప్రేక్షకులందరినీ ‘బేబి’ సినిమా కోసం వెయిట్ చేసేలా చేసింది. ఇన్ని రోజులుగా ఊరిస్తూ వచ్చిన ఆ రిలీజ్ డేట్ రానే వచ్చేసింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ బ్రదర్ ఆనంద్ దేవరకొండ హీరోగా, వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటిస్తున్న ‘బేబీ’ మూవీ మరో 48 గంటల్లో ఆడియన్స్ ముందుకి రానుంది. ఎస్.కె.ఎన్ నిర్మాణంలో సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు, విజయ్ బుల్గానిన్ ఇచ్చిన ట్యూన్స్ అదిరిపోయాయి. ముఖ్యంగా ‘ఓ రెండు ప్రేమ మేఘాలు’ అనే సాంగ్ యూట్యూబ్‌ని షేక్ చేసింది. సినిమా ప్రమోషన్స్ కూడా అదే రేంజ్‌లో ఉండడంతో… బేబి థియేటర్ రాక కోసం… యూత్ ఈగర్‌గా వెయిట్ చేస్తోంది. ఎట్టలకేలకు జులై 14న గ్రాండ్‌గా థియేటర్స్‌లోకి వస్తోంది బేబి సినిమా. ఈ మధ్య కాలంలో ఒక చిన్న సినిమా, అది కూడా ఒక ప్రేమ కథ సినిమాకి ఇంత పాజిటివ్ బజ్ చూడడం ఇదే మొదటిసారి.
రిలీజ్‌కు ఓ రోజు ముందుగానే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది బేబి. సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ ఇచ్చారు. ప్యూర్ లవ్ స్టోరీ సినిమా కాబట్టి క్లీన్ U వస్తుంది అనుకున్న వాళ్లకి, U/A లభించడం అనేది షాక్ ఇచ్చే విషయమే. దీంతో ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో క్లీన్ లవ్ స్టోరీతో పాటు ట్రైలర్ లో చూపించని విషయం ఎదో ఉంది అనే ఫీలింగ్ అందరిలోనూ కలుగుతుంది. ఈ సినిమాకు వచ్చిన బజ్ ప్రకారం… కంటెంట్ సాలిడ్‌గా ఉండి, పాజిటివ్ టాక్ వస్తే, యూత్ బేబి సినిమాని సెన్సేషన్‌గా నిలిపేందుకు రెడీగా ఉన్నారు. ఎందుకంటే.. బేబీ ఒక ప్యూర్ లవ్ స్టోరీ అంటూ గట్టిగా ప్రమోట్ చేశారు మేకర్స్. బేబీ యూత్ హార్ట్ టచ్ చేస్తే చాలు ఉప్పెన లాంటి హిట్ టాలీవుడ్ ఖాతాలో పడినట్టే. పైగా ఈ వారం డబ్బింగ్ సినిమాలు తప్పితే తెలుగు నుంచి వస్తున్న స్ట్రెయిట్ ఫిల్మ్ ఇదొక్కటే ఉంది కాబట్టి… బేబి ఏ మాత్రం బాగున్నా సెన్సేషన్‌గా నిలుస్తుందని చెప్పొచ్చు.
Also Read
తాజావార్తలు
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యాకు ఆఫర్లే ఆఫర్‌లు.. అతడితో విబేధాల ప్రభావం ట్రేడ్‌పై ఉంటుందా?
-
World’s Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!