Subhasree Rayaguru: ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్లకు కొదువే లేదు. తెలుగు తారలు పైకి రావడం తక్కువేమో కానీ ఇండస్ట్రీలోకి రోజుకో కొత్త హీరోయిన్ అడుగుపెడుతూ ఉంటుంది. ఇక తాజాగా రుద్రవీణ సినిమాతో ఫెమినా మిస్ ఇండియా ఒడిశా గా గెలిచిన శుభశ్రీ రాయగురు తెలుగు తెరకు పరిచయమవుతోంది. శ్రీరామ్ నిమ్మల హీరోగా మధుసూదన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 28 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం ప్రమోషన్ల వేగాన్ని పెంచేసింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో హీరోయిన్ శుభశ్రీ, సమంత విడాకుల గురించి మాట్లాడడం హాట్ టాపిక్ గా మారింది. సమంత విడాకులు తీసుకొని మంచి పని చేసిందని, ఆమె ఎంతోమందికి ఆదర్శమని చెప్పి షాక్ ఇచ్చింది.
“సమంత నాకే కాదు చాలామంది అమ్మాయిలకు ఇన్స్పిరేషన్. విడాకుల తరువాత ఎన్ని విమర్శలు వచ్చినా స్ట్రాంగ్ గా నిలబడి పోరాడుతుంది. సామ్ నుంచి మనం చాలా నేర్చుకోవాలి.. ఒకపక్క సమస్యలతో పోరాడుతూనే కెరీర్ లో ముందుకు వెళ్తోంది. అవకాశం వస్తే ఆమెతో నటించాలని ఉంది”అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. సామ్ విడాకులు తీసుకోవడమే నచ్చలేదంటున్న అభిమానులకు శుభశ్రీ మాట్లాడిన మాటలు కొద్దిగా అసహనాన్ని కలిగిస్తున్నాయన్న మాట వాస్తవమే.. మరి ఈ వ్యాఖ్యలపై సామ్ అభిమానులు, సామ్ ట్రోలర్స్ ఏమంటారో చూడాలి.
