Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం రష్యాలో సందడి చేస్తున్న విషయం తెల్సిందే. రష్యాలో పుష్ప సినిమాను రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం రష్యాలో ప్రమోషన్స్ మొదలుపెట్టిన విషయం తెల్సిందే. నిన్ననే రష్యాలో ల్యాండ్ అయిన పుష్ప రాజ్ ప్రెస్ మీట్ లో రష్యన్ లాంగ్వేజ్ మాట్లాడి ఆశ్చర్యపరిచాడు. ఇక స్టైల్ లో తగ్గేదేలే అని ముందు నుంచి నిరూపించే బన్నీ మరోసారి తన యూనిక్ స్టైల్ ను బయటపెట్టాడు. రష్యా వీధుల్లో ఐకాన్ స్టార్ ఐకానిక్ పోజ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
బ్లాక్ ఫ్లోరల్ కుర్తా పై బ్లాక్ జాకెట్, కళ్లద్దాలతో స్టైలిష్ స్టార్ పేరుకు తగ్గట్టే ఉన్నాడు. అలా పుష్పరాజ్ నడుచుకొంటూ వస్తుంటే.. ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ముఖ్యంగా అమ్మాయిలు అయితే అబ్బా.. ఏమున్నాడురా బాబు అంటూ అనుకోకుండా మానరు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే నేడు, రేపు జరగబోయే స్పెషల్ ప్రీమియర్స్ లో రష్యన్ అభిమానులతో పాటు బన్నీ సందడి చేయనున్నాడు. రష్యాలో పుష్ప డిసెంబర్ 8 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి అక్కడ ఈ పుష్పరాజ్ ఎలాంటి రికార్డులు బద్దలుకొడతాడో చూడాలి.
