Site icon NTV Telugu

Tollywood : సెకండాఫ్ సమరానికి స్టార్స్ రెడీ.. బోణి కొట్టబోతున్న పవర్ స్టార్

Tollywood

Tollywood

ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ సో సో గా సాగింది. సంక్రాంతి తర్వాత స్టార్ హీరోల సినిమాలు రాలేదు. ఇక ఇప్పడు సెకండ్ హాఫ్ పైనే డిస్ట్రిబ్యూటర్స్  ఆశలన్నీ. సెకండ్ హాఫ్ ను గ్రాండ్ గా స్టార్ట్ చేస్తున్నాడుపవర్ స్టార్ పవన్ కళ్యాణ్. జులై 24న హరిహర వీరమల్లు గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. ఆ వెంటనే వారం గ్యాప్ లో జులై 31న కింగ్డమ్ తో వస్తున్నాడు విజయ్ దేవరకొండ.  ఇక కూలీ వస్తున్న ఆగస్ట్ 14నే ఎన్టీఆర్‌, హృతిక్‌ ‘వార్‌2’ రిలీజ్‌ అవుతోంది.  రెండిటిపై భారీ అంచనాలు ఉన్నాయి. భారీ ఓపెనింగ్ కూడా ఉండబోతుంది.

ఇక  హనుమాన్‌ తర్వాత యంగ్‌ హీరో తేజ్‌ సజ్జా నటిస్తున్న చిత్రం ‘మిరాయ్‌’ సెప్టెంబర్ 5న వస్తోంది. అదే నెలలో బాలయ్య- బోయపాటి ల బ్లాక్ బస్టర్ అఖండ 2 వస్తోంది. అదే నెలలో పవర్ స్టార్ OG, మెగాస్టార్ విశ్వంభర కూడా ప్లానింగ్ లో ఉంది. ఇక అక్టోబర్‌2న కాంతార 2 రిలీజ్‌ అవుతోంది. కన్నడలో రూ. 18 కోట్లతో తీసిన కాంతార వరల్డ్‌వైడ్‌ రూ. 300 కోట్లకు పైగా రాబట్టింది. రెండేళ్లుగా సీక్వెల్‌ కథను రాసుకున్న రిషబ్‌శెట్టి ఫుల్‌ ఎఫెక్ట్‌ పెడుతున్నాడు. బ్లాక్‌బస్టర్‌కు సీక్వెల్‌ కావడంతో ఓపెనింగ్స్‌ మామూలుగా వుండదు. ఇక టీజర్‌ రిలీజ్‌ రాజాసాబ్‌కు హైప్‌ తీసుకొచ్చింది. సినిమా డిసెంబర్‌ 5న రిలీజ్‌ అవుతోంది. లవ్‌ టుడే.. డ్రాగన్‌ వంటి వరుస హిట్స్‌తో దూకుపోతున్న ప్రదీప్‌ రంగనాథ్‌కు తెలుగులో మంచి మార్కెట్‌ అందుకున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌ ప్రదీప్‌తో తీస్తున్న డూడ్‌ మూవీ దీపావళికి రిలీజ్‌ అవుతోంది.యూత్‌లో క్రేజ్‌ వున్న ప్రదీప్‌ మంచి ఓపెనింగ్స్ రాబడతాడు. ఫస్టాఫ్ కాస్త నిరాశ పరిచిన సెకండాఫ్ కాస్త ఆశలు పెంచుతోంది. మరి వీటిలో హిట్ అయ్యేది ఎవరో చూడాలి.

Exit mobile version