NTV Telugu Site icon

Formula E Race: ఆహా.. స్టార్ హీరోల సతీమణులు.. పతులు లేకుండానే వచ్చారే

Heroines

Heroines

Formula E Race: అంతర్జాతీయ మోటార్‌ కార్‌ రేసింగ్‌ సంస్థ (ఎఫ్‌ఐఏ) ఎలక్ట్రికల్‌ కార్లతో తొలిసారి ఫార్ములా ఈ-వరల్డ్‌ చాంపియన్‌‌షిప్ హైదరాబాద్ లో జరుగుతున్న విషయం తెల్సిందే. ఈ నెల 11, 12 తేదీల్లో ఫార్ములా ఈ రేసింగ్‌ ను నిర్వహించనుంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే ఈ ఫార్ములా ఇ రేసింగ్‌ ప్రమోషన్స్ కోసం సినీతారలు దిగివచ్చి అభిమానుల్లో ఆసక్తి పెంచుతున్నారు. ఇక రెండు రోజుల క్రితమే సంగీత దర్శకుడు థమన్ సంగీత సారథ్యంలో ఫార్ములా ఇ రేసింగ్‌ ప్రమోషన్ సాంగ్ కూడా రిలీజ్ అయ్యింది. ఇందులో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా పాల్గొన్నాడు. ఇక తాజాగా హైదరాబాదులో ఫార్ములా-ఇ రేసింగ్ ట్రాక్ ను టాలీవుడ్ స్టార్ హీరోల భార్యలు సందర్శించారు. మహేష్ బాబు భార్య నమ్రత, ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతితో పాటు నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మణి కూడా సందడి చేశారు.

Ananya Pandey: ఉఫ్.. విప్పి చూపించడం కాదు.. యాక్టింగ్ కూడా నేర్చుకో

ఇక ఈ సందర్భంగా మహేష్ భార్య నమ్రత మాట్లాడుతూ.. హైదరాబాద్ లో ఫార్ములా ఇ రేసింగ్‌ నిర్వహించడం గ్రేట్ అని చెప్పుకొచ్చింది. తానెప్పుడు ఫార్ములా ఇ రేసింగ్‌ హైదరాబాద్ లో చూడలేదని, ఇదే మొదటిసారి అని తెలిపింది. తనకు రేసింగ్ పెద్దగా ఇష్టముండదని, తన కొడుకు గౌతమ్ కు బాగా ఇష్టమని చెప్పిన నమ్రత సంవివరం ఈ రేసింగ్ చూడడానికి గౌతమ్ కూడా వస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ఇక మహేష్ బాబు ఊర్లో లేని కారణంగా ఆయన రాలేకపోతున్నట్లు చెప్పుకొచ్చింది. మరోపక్క ఈ ముగ్గురు సతీమణులు.. పతులు లేకుండా రావడం విశేషం. ముఖ్యంగా తారక్ భార్య ప్రణతి.. తారక్ లేకుండా ఆమె బయట ఎక్కువ కనిపించదు. వీరు ముగ్గురు ముచ్చట్లు పెట్టుకున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి శనివారం ఈ రేసింగ్ లో ప్రముఖులు ఎలాంటి సందడి చేస్తారో చూడాలి.