NTV Telugu Site icon

Sai Abhyankar : స్టార్ సింగర్ కొడుకు.. సంగీత దర్శకుడిగా సెన్సేషన్..

Sai Abhyankar

Sai Abhyankar

20 ఏళ్లు నిండని ఓ నూనుగు మీసాల కుర్రాడు రీసెంట్లీ మ్యూజిక్ సెన్సేషన్ అయ్యాడు. ప్రైవేట్ ఆల్బమ్స్‌తో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. అతడే సాయి అభ్యంకర్. కచ్చి సేరా, ఆసా కూడా, సితిరా పుతిరి సాంగ్స్ వచ్చే వరకు కూడా ఈ యంగ్ బాయ్ స్టార్, సింగర్స్ టిప్పు, హరిణీ కొడుకన్న విషయం ఎవరికీ తెలియదు. జస్ట్ తన టాలెంట్‌తోనే  రిజిస్టర్ అయ్యాడు.  ఈ ప్రైవేట్ ఆల్బమ్స్‌తో యూత్‌లో మంచి ఫాలోయింగ్ పెంచుకున్నాడు సాయి అభ్యంకర్. ఈ సాంగ్సే అతడికి ఆఫర్లను తెచ్చిపెట్టాయి. లారెన్స్ హీరోగా లోకేశ్ కనగరాజ్ నిర్మాతగా తెరకెక్కుతోన్న బెంజ్ మూవీకి బాణీలు సమకూర్చే ఛాన్స్ కొల్లగొట్టాడు.

ఇలా ఫస్ట్ ఛాన్స్ బ్యాగ్‌లో వేసుకున్నాడో లేదో వరుస ఆఫర్లను చేజిక్కుంచుకుంటున్నాడు ఈ యంగ్ బాయ్. టెస్ట్ రిజల్ట్ రానే లేదూ బిగ్ హీరోల ప్రాజెక్టులకు క్యాచ్ చేస్తున్నాడు. సూర్య-ఆర్జే బాలాజీ కాంబోలో తెరకెక్కుతోన్న సినిమాకు తొలుత ఏఆర్ రెహమాన్ అనుకుంటే ఆయనకున్న కమిట్మెంట్స్ వల్ల తప్పుకున్నారు.  ఆ ఆఫర్ సాయి అభ్యంకర్ చేతికి చిక్కింది.  అలాగే సెన్సేషనల్ హీరో ప్రదీప్ రంగనాథ్- కీర్తిస్వరన్ కాంబోలో వస్తోన్న  సినిమాకు మ్యూజిక్ అందించే ఛాన్స్ దక్కించుకున్నాడు ఈ స్టార్ సింగర్స్ సన్. శింబు తన అప్ కమింగ్ చిత్రాలకు మ్యూజిక్ ఇచ్చే బాధ్యతను ఈ యంగ్ బాయ్ చేతిలో పెట్టాడని టాక్. శింబు 49వ, 51వ చిత్రాలకు అతడే కంపోజర్ అని తెలుస్తోంది. అలాగే అట్లీ – అల్లు అర్జున్ సినిమాకు కూడా సాయి పేరు పరిశీలనలో ఉంది. ఇలా అతి తక్కువ కాలంలో టాప్ మ్యుజిషియన్ గా మారడు ఈ స్టార్ సింగర్ సన్.