Pravasthi Issue : స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణిపై సింగర్ ప్రవస్తి సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. పాడుతా తీయగా షోలో ఎలిమినేట్ అయిన ప్రవస్తి.. ఆ షో మీద, అందులోని జడ్జిలు కీరవాణి, సునీత, చంద్రబోస్ ల మీద సంచలన ఆరోపణలు చేసింది. వారంతా తనను ఘోరంగా అవమానించారని.. బాడీ షేమింగ్ చేశారని ఆరోపించింది. ఆ షో నిర్వాహకులు తనను బొడ్డు కిందకు చీర కట్టుకుని ఎక్స్ పోజ్ చేయాలన్నారు అంటూ వీడియో రిలీజ్ చేయడంతో పెద్ద దుమారమే రేగుతోంది. ఇలాంటి టైమ్ లో మరో స్టార్ సింగర్ హారిక నారాయణ్ ట్విస్ట్ ఇచ్చింది. కీరవాణిపై చేస్తున్న ఆరోపణలు అన్నీ అవాస్తవాలే అంటూ కొట్టి పారేసింది.
Read Also : Priyanka Chopra : ప్రియాంక చోప్రాకు ప్రపంచ స్థాయి అవార్డు
ఇందుకోసం ఆమె తాజాగా ఓ వీడియో రిలీజ్ చేసింది. ‘ప్రవస్తికి అన్యాయం జరిగింది అంటూ ఓ యూట్యూబ్ ఛానెల్ లో ఆమె డిబేట్ పెట్టింది. కానీ ఆ డిబేట్ లో నా రీల్ కు సంబంధించిన వీడియోను చూపించారు. అది అస్సలు కరెక్ట్ కాదు. నేను ఓ ప్రైవేట్ సాంగ్ వీడియో చేశాను. ఆ వీడియోన కీరవాణి గారు రిలీజ్ చేసి సపోర్ట్ చేశారు. ఆ రీల్ లో ఆయన ముందు అలా నిలబడాలి అని నేను అనుకున్నాను. అంతే గానీ ఎవరూ చెప్పలేదు. దాన్ని తప్పుగా ప్రచారం చేస్తున్నారు. ఒక లెజెండరీ అయిన కీరవాణి గారు నా వీడియోను ప్రమోట్ చేయాల్సిన అవసరం ఆయనకు లేదు. కానీ కొత్తవారిని ఎంకరేజ్ చేసేందుకు ఆయన సపోర్ట్ చేశారు.
నాకు కాదు చాలా మందికి ఆయన సపోర్ట్ చేస్తున్నారు. కావాలంటే ఆయన చుట్టూ ఉన్న వారిని అడగండి. నిజాలు తెలుసుకోకుండా తప్పుగా ప్రచారాలు చేయకండి. కీరవాణి గారి నుంచి వర్క్ మాత్రమే కాదు.. జీవితంలో ఎలా ఉండాలో కూడా నేర్చుకోవచ్చు. ఆయన వ్యక్తిత్వం గురించి మాట్లాడే స్థాయి మనకు లేదు’ అంటూ తీవ్ర స్థాయిలో స్పందించింది హారిక.
