ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు మరోసారి తండ్రి అయ్యారు. ‘దిల్’ రాజు భార్య తేజస్విని పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్టు తాజా సమాచారం. సినిమా పంపిణీ రంగం నుండి నిర్మాతగా మారిన ‘దిల్’ రాజు సూపర్ డూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. తెలుగుతో పాటు ఇటీవలే హిందీ చిత్రసీమలోకీ అడుగుపెట్టారు. కమర్షియల్ సక్సెస్ లనూ ఓ వైపు అందుకుంటూనే జాతీయ స్థాయిలో అవార్డులనూ పొందారు. నిర్మాతగా విజయపథంలో సాగుతున్న సమయంలోనే ‘దిల్’ రాజు సతీమణి అనిత 2017లో గుండెపోటుతో కన్నుమూశారు. ఆ తర్వాత మూడేళ్ళకు 2020లో ‘దిల్’ రాజు తేజస్విని ద్వితీయ వివాహం చేసుకున్నారు. వారికి ఇప్పుడు కొడుకు పుట్టాడు. దిల్ రాజు, అనిత దంపతులకు ఓ కూతురు హన్సితా రెడ్డి ఉంది. ఇప్పటికే వివాహం చేసుకున్న హన్సితా రెడ్డి ప్రస్తుతం ‘ఆహా’ ఓటీటీలో భాగస్వామిగా ఉన్నారు. తాజాగా ‘దిల్’ రాజుకు కొడుకు పుట్టడంతో స్టార్ ప్రొడ్యూసర్ ఇంటికి ఎట్టకేలకు వారసుడొచ్చాడంటూ చిత్రసీమలోని ఆయన స్నేహితులు అభినందనలు తెలుపుతున్నారు.
Read Also: Ram Pothineni: ‘ది వారియర్’ ట్రైలర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్
