Site icon NTV Telugu

Samantha: దేవరకొండ ఫాన్స్ కి సారీ చెప్పిన సమంతా…

Khushi

Khushi

అనారోగ్యం నుంచి కాస్త కోలుకోని శాకుంతలం సినిమా ప్రమోషన్స్ ని వచ్చిన లేడీ సూపర్ స్టార్ సమంతా, తాజాగా #CITADEL వెబ్ సిరీస్ షూటింగ్ లో జాయిన్ అయ్యింది. అమెజాన్ ప్రైమ్ లో టెలికాస్ట్ కానున్న ఈ సీరీస్ ని రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేస్తున్నారు. ఈరోజు సమంతా షూటింగ్ లో జాయిన్ అయినట్లు #CITADEL అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. దీంతో సమంతా ఫాన్స్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు కానీ విజయ్ దేవరకొండ ఫాన్స్ మాత్రం అప్సెట్ అవుతున్నారు. విజయ్ దేవరకొండ, సమంతా కలిసి శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఖుషి’ అనే సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ప్యూర్ లవ్ స్టొరీగా ‘ఖుషి’ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. ఇంతలో సమంతా హెల్త్ బాగోలేకపోవడంతో ఖుషి సినిమా షూటింగ్ ఆగిపోయింది.

Read Also: Sam: ఖుషి తర్వాత సమంతా తెలుగు సినిమా ఏంటి?

ఖుషి మూవీ షూటింగ్ మళ్లీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే విషయంలో ఎవరికీ ఎలాంటి క్లారిటీ లేకపోవడం, సమంతా ఖుషి సినిమాకి డేట్స్ అడ్జస్ట్ చెయ్యట్లేదు అనే రూమర్ స్ప్రెడ్ అవ్వడంతో దేవరకొండ ఫాన్స్ సమంతాని ట్యాగ్ చేస్తూ “ఖుషీ” మూవీ పరిస్థితి ఏంటి అది ట్విట్టర్ లో అడుగుతున్నారు. దీంతో సమంతా “#Kushi will resume very soon .. my apologies to @TheDeverakonda fans” అంటూ రెస్పాండ్ అయ్యింది. ఈ ట్వీట్ చూడగానే “మాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు సామ్, మేము నిన్ను అర్ధం చేసుకోగలము” అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

https://twitter.com/Samanthaprabhu2/status/1620670271631015939

సమంతా ట్వీట్ చూసిన హీరో విజయ్ దేవరకొండ “నువ్వు బిగ్ స్మైల్ తో తిరిగి వచ్చే వరకూ ఎదురు చూస్తాం” అంటూ రిప్లై ఇచ్చాడు.

ఖుషి సినిమా షూటింగ్ త్వరలో స్టార్ట్ అవుతుంది అనే క్లారిటీ స్వయంగా సమంతానే ఇవ్వడంతో, ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది, అటకెక్కింది అనే రూమర్ కి ఎండ్ కార్డ్ పడినట్లు అయ్యింది.

Read Also: Samantha: బ్యూటీ క్వీన్ ఈజ్ బ్యాక్… #CITADEL

Exit mobile version