Site icon NTV Telugu

Meenakshi :పెళ్లి గురించి ఓపెన్ అయిన మీనాక్షి చౌదరి

Meenakshi Chowdari

Meenakshi Chowdari

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల వరుస విజయాలు అందుకుంటు ఫుల్ ఫామ్ లో ఉన్న హీరోయిన్ మీనాక్షి చౌదరి. గత ఏడాది కాలంగా ఆమె నటించిన ప్రతి సినిమా సూపర్ హిట్ అయ్యాయి. ముక్యంగా సంక్రాంతి కానుకగా విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ థియేటర్స్‌లో సత్తా చాటుతోంది. జనవరి 14 న విడుదలైన ఈ సినిమా థియేటర్లలో భారీ వసూళ్లను రాబడుతోంది. అనిల్ రావిపూడి రూపొందించిన ఈ చిత్రంలో వెంకటేష్ హీరోగా నటించగా.. వెంకీ భార్యగా ఐశ్వర్య రాజేష్, లవర్ గా మీనాక్షి చౌదరి నటించారు. ఇద్దరికి ఇద్దరు తమ నటనతో ప్రేక్షకుల మనసు దోచేశారు. చిన్న పెద్ద తేడా లేకుండా ఈ మూవీకి ప్రతి ఒక్కరు వందకి వంద మార్కులు వేశారు. దీంతో మీనాక్షి గ్రాఫ్ మరింత పెరిగిపోయింది.

Also Read: Puri Jagannadh: మల్టీ స్టారర్ సినిమా ప్లాన్ చేస్తున్న పూరి జగన్నాథ్..!

అయితే ఈ మూవీ సక్సెస్ లో భాగంగా టీం వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటుంది. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనాక్షి చౌదరి తన పెళ్లి, కాబోయే భర్త ఎలా ఉండాలో చెబుతూ ఓపెన్ అయింది.. మీనాక్షి మాట్లాడుతూ ‘ నాకు కాబోయే వాడు మంచి హైట్ ఉండటంతో పాటు బాగా తెలివైనవాడు, మంచి మనసున్నోడై ఉండాలి. ఓ మగాడిలో నాకు కావాల్సిన అంశాలు ఇవే. నాలాంటి రూపానికి తగిన అబ్బాయి కావాలి, నాకు సమానంగా మేల్ వెర్షన్ ఉండాలి. ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తి దొరికితే వెంటనే పెళ్లి చేసుకుంటాను’ అని మీనాక్షి చెప్పుకొచ్చింది. ప్రజంట్ ఈ అమ్మడు మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Exit mobile version